వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ నేత, మాజీ మంత్రి ఉప్పునూతల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

uppunutha purushotham reddy
హైదరాబాద్ : మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెస్‌ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో ఆయన శనివారం ఉదయం 5 గంటల 15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా పురుషోత్తం రెడ్డి బ్రెయిన్‌స్ట్రోక్‌తో బాధపడుతున్నారు.

మే 1న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఉప్పునూతల కోమాలోనే ఉన్నారు. ఉప్పునూతల స్వగ్రామం నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో పురుషోత్తం రెడ్డి మంత్రిగా పనిచేశారు. రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్సీగా, తెలంగాణ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, ఎపిఐఐసీకి చైర్మన్‌గా ఉప్పునూతల పనిచేశారు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతి పట్ల పలువురు దిగ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నేతను కోల్పోయామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నల్లగొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు.

పురుషోత్తమ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెసు పార్టీలో కొనసాగారు. ఇటీవల ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. 80 ఏళ్ల వయస్సు గల పురుషోత్తమరెడ్డికి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. ఆయనకు కభార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

English summary
Former minister and YS Jagan's YSR Congress party leader Uppunuthal Purushotham Reddy has passed away in Hyderabad hospital. He hails from Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X