వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత కాన్సులేట్ వద్ద పేలుడు: ఆరుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb blast
కాబూల్: అఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో భారత కాన్సులేట్‌పై ఆత్మహుతి దళ సభ్యుడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 23 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం పది గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత కాల్పులు జరిగిన శబ్దాలు వినిపించాయి.

మృతులంతా సాధారణ పౌరులే. గాయపడినవారిలో అప్ఘానిస్తాన్ సైనికుడు ఉన్నాడని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. భారతీయులంతా క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా శుక్రవారం తన యాత్రికులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శనివారం జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా కాబూల్ సహా ఉన్న 21 రాయబార కార్యాలయాలను, కాన్సులేట్లను ఆదివారం మూసి ఉంచాలని అమెరికా ఆదేశించింది. ఆత్మాహుతి దళ సభ్యుడు భారత కాన్సులేట్ వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడని చెబుతున్నారు. భారత కాన్సులేట్‌కు వెళ్లే మార్గాలను మూసివేశారు.

English summary

 A large explosion struck an area near Indian Embassy in the eastern Afghan city of Jalalabad on Saturday killing six civilians and 22 injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X