వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌లో అభద్రతా భావం, బాబు హుందా: మందకృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: తాను లేకుండా తెలంగాణపై ప్రకటన ఎలా జరిగిందనే అభద్రతా భావం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యడు కల్వకుంట్ల చంద్రశఖర రావులో ఉందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం అన్నారు. అభద్రతా భావంతోనే ఆయన చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్సించారు. ఒకరిని బలవంతంగా పంపించే శక్తి లేదా ఆపే శక్తి ఆయనకు లేదన్నారు.

సీమాంధ్రులు కెసిఆర్ వ్యాఖ్యలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన ఉనికి కోసం చిల్లర మాటలు వద్దన్నారు. తెలంగాణ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హుందాగా స్పందించారన్నారు. పంపకాలు అన్ని రాజ్యాంగబద్ధంగానే జరుగుతాయన్నారు.

ఇష్టం లేకనే: గజ్జెల కాంతం

తెలంగాణ రావడం ఇష్టం లేకనే కెసిఆర్ దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఎన్నిడూలేనంతగా నేడు సచివాలయంలో ఉందంటే అక్కడ పని చేస్తున్న కెసిఆర్ బంధువులైన నరేంద్ర రావు, శ్రీనివాస రావులను కెసిఆర్ ప్రోత్సహించడమే అందుకు కారణమన్నారు.

సీమాంధ్ర ఉద్యోగుల్ని హేళన చేస్తూ ఇక్కడి నుండి పొమ్మని చెప్పడానికి కెసిఆర్ ఎవరని ప్రశ్నించారు. ప్రజలు శ్రమపడి తెచ్చుకున్న తెలంగాణను ఆయన ఇష్టం లేక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి బయటకెళ్లాల్సి వస్తే మొదట పోవాల్సింది ఆయనే అన్నారు.

English summary

 MRPS president Manda Krishna Madiga alleged that TRS chief K Chandrasekhar Rao is felt insecurity with Telangana announcement by Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X