వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుపల్లి, యాష్కీ మధ్య ఆసక్తిక చర్చ, పితాని రిజైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu - Madhu Yashki
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఇరువురు శనివారం చలోక్తులు విసురుకున్నారు. కాంగ్రెసు పార్టీకి ముప్పై తలుపులు, ముప్పై కిటీకీలు ఉంటాయని, ఎవరు ఎటు వైపు దూకుతారో తెలియదని, తమ పార్టీకి ఒకటే తలుపు, ఒకటే కిటికీ, ఓ పద్ధతి ప్రకారం ఉంటుందని మోత్కుపల్లి అసెంబ్లీ ఆవరణలో యాష్కీతో అన్నారు.

ఇరువురు కలిసినప్పుడు మొదట మోత్కుపల్లి స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సంబంధం లేకుండా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు. అందుకు యాష్కీ... తమ ఆలోచన మొదటి నుండి అదేనని చెప్పారు. వచ్చిన తెలంగాణ వెనక్కుపోయే అవకాశం లేదని, పార్టీల్లో అలజడి తగ్గడానికి మన వంతు ప్రయత్నం చేద్దామని మోత్కుపల్లితో అన్నారు.

దీంతో మోత్కుపల్లి తలుపులు, కిటీకీల వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ సీమాంధ్ర నేతలు విభజనను వ్యతిరేకించడం లేదని, తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. సీమాంధ్ర టిడిపి నేతల రాజీనామాలను యాష్కీ గుర్తి చేయగా.... తమ నేతలు రాజీనామా చేస్తోంది విభజనను వ్యతిరేకిస్తూ కాదని, ఆ విషయాన్ని వారు స్పష్టంగా చెబుతున్నారని, తమ ప్రాంతానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను అడగడాన్ని ఎలా తప్పు పడతామన్నారు.

పితాని రాజీనామా

రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పితాని సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేసినట్లు ఆయన చెప్పారు.

English summary

 TDP senior MLA Mothkupalli Narasimhulu on Satureday commented that Congress have many doors and many windows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X