వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వాదనలు వినడానికి ద్విసభ్య కమిటీ: జెడి శీలం

By Pratap
|
Google Oneindia TeluguNews

JD sheelam
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వాదనలను, అభ్యంతరాలను ఎకె ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య కమిటీ వింటుందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి జెడి శీలం చెప్పారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీతో సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. పదవులకు రాజీనామాలు చేద్దామని కొందరు, మంత్రి పదవులకే రాజీనామాలు చేద్దామని మరికొందరు, పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేద్దామని ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారని అన్నారు.

సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులను కలుసుకున్నామని, రాష్ట్ర పరిస్థితులను తెలుసుకున్నామని జేడీ శీలం అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని వర్గాలవారి పరిస్థితి గురించి ఆలోచించామని, దీనిపై సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం ఓ నిర్ణయానికి వచ్చారని, వాటిని తాము అంగీకరించారమని జేడీ తెలిపారు. వారు తీసుకున్న అభిప్రాయాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌లను కలిసి వివరిస్తామని చెప్పారు.

సమస్యకు పరిష్కారం రాజీనామాలు కాదని, రాజీనామాలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, అందరూ రాజీనామాలు చేస్తే ఎవరు పనిచేస్తారని జేడీ శీలం అన్నారు. ఇక్కడ పని చేసే చూపించాలని ఆయన అన్నారు.

రాష్ట్ర సమస్యలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని ఈ కమిటీలో కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాదులో అన్ని వర్గాల యోగక్షేమాలను ఎలా కాపాడాలనే విషయంపై కూడా తాము చర్చించామని ఆయన చెప్పారు.

English summary
union minister from Seemandhra JD Sheelam said that defence minister AK Antony and Andhra Pradesh Congress affairs incharge Digvijay Singh will hear their arguements on bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X