• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాకే ఆ ధైర్యం: టిపై పిసి చాకో, కబడ్డీ ఆడిన నన్నపనేని

By Srinivas
|
PC chacko
న్యూఢిల్లీ/హైదరాబాద్: చారిత్రక నిర్ణయాలు తీసుకునే ధైర్యం కాంగ్రెసు పార్టీకే ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో బుధవారం అన్నారు. తెలంగాణపై తాము ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయాల అమలుకే ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పడిందన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం తమ పార్టీకే ఉందన్నారు.

ఆంటోనీ కమిటీని స్వాగతిస్తున్నాం

తాము ఆంటోనీ కమిటీని స్వాగతిస్తున్నామని కాంగ్రెసు ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, రాజయ్యలు అన్నారు. సీమాంధ్ర ప్రజలలో భయాందోళనలు తొలగించేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారన్నారు.

ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి: కోదండ

తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తే కాల్చివేస్తామన్న డిజిపి సమైక్య ఉద్యమాన్ని మాత్రం ముందుండి నడిపిస్తున్నారని టిజెఏసి చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. సమైక్య ఉద్యమానికి ముఖ్యమంత్రి అండ ఉందన్నారు. ఈ నెల 10వ తేది నుండి శాంతి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. వర్షాకాల సమావేశాల్లోని బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని కిరణ్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

అపోహలు వద్దు: డికె అరుణ

తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి డికె అరుణ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మేధావుల సూచనలతో సాగునీరు, విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలన్నారు.

సీమాంధ్రలో సమైక్య ఆందోళన

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విశాఖలో సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. ఆమె కబడ్డీ ఆడి, నృత్యం చేసి, వంటా వార్పులో పాల్గొన్నారు. విభజనపై ప్రధానమంత్రి నోరు విప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

చిరు, కావూరి... కనిపించుట లేదు

సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, ఎంపీ కనుమూరి బాపిరాజులు కనబడటం లేదంటూ సమైక్యవాదులు వాల్ పోస్టర్లు అంటించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

పలమనేరులో సమైక్యవాదులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సోనియా గాంధీని యాచకురాలిగా, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావులను ఆడవారి వేషంలో, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ బొమ్మను తయారు చేసి మద్యం సీసా వేలాడదీసి నిరసన తెలిపారు. కాగా ఎపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం సిఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని లేదంటే ఈ నెల 12వ తేది అర్ధరాత్రి నుండి సమ్మె చేస్తామని తెలిపింది.

English summary
AICC spokes person PC Chacko said that the decision of the Congress and UPA on dividing the state is final.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X