వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరును విలన్‌గా చూడొద్దు: సిఆర్, జగన్ పత్రికపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

chiranjeevi
హైదరాబాద్: తెలంగాణ కావాలని తమ పార్టీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఏనాడు కోరలేదని, విభజనకు ఆయనే విలన్ అంటూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బురదజల్లడం సరికాదని మంత్రి సి.రామచంద్రయ్య మంగళవారం అన్నారు. రాష్ట్ర విభజనను ఆ రెండు పార్టీలు సమర్థించాయని, ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెప్పడమే కాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాయన్నారు.

ఇప్పుడు సీమాంధ్రలో ప్రజాందోళనను చూసి అక్కడ రాజకీయ లబ్ధి పొందేందుకు ఉద్యమం ముసుగులో ఆ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. విభజన నేపథ్యంలో చిరును విలన్‌గా చూపించడం సరికాదన్నారు. చిరంజీవి ఏనాడైనా తెలంగాణ కావాలని కోరారా అని, విభజన జరగాలని చెప్పారా అని, తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని, అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాత్రమే పలుమార్లు చెప్పారన్నారు.

చిరంజీవిపై ఆ రెండు పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సొంత మీడియా ద్వారా వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర విభజనపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆమెను చరిత్ర క్షమించమదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకోవాలంటూ ఆమె నిర్ణయం తీసుకున్నారన్నారు. రాయలసీమకు చెందిన ముఖ్యనేతలతో రాషట్ర్ానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

English summary
Telugudesam and YSR Congress are responsible for the Telangana decision, they cannot blame Central Tourism Minister chiranjeevi, said Minister C Ramachandraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X