వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4నెలల పదవి వదలండి: వీరశివా, చిరు బాటలో నిరసన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasaiva blames Central Ministers
హైదరాబాద్/విశాఖ/విజయనగరం: 4 నెలల మంత్రి పదవుల కోసం కేంద్రమంత్రులు సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయవద్దని కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి హితవు పలికారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రులు డ్రామాలు ఆపి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, పనబాక లక్ష్మి.. అందరూ ఉద్యమంలో పాల్గొనాలన్నారు.

విభజనపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. కాంగ్రెసు పార్టీ విధిలేని పరిస్థితుల్లోనే విభజన పైన నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు పలికాయన్నారు. ఇప్పుడు ఆ పార్టీలు మనసు మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును చంపాల్సిన అవసరం సీమాంధ్రులకు లేదన్నారు.

ఆస్తులు, రాజకీయ వారసత్వం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా సుపారీ ఇచ్చారేమో అన్నారు. వార్తల్లో ఉండేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారన్నారు. కొందరు రాయల తెలంగాణ అంటున్నారని, అది సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కోసం నేతలు, పార్టీలు ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా బయటకు వస్తారని, ఆయన గురించి అందరికీ తెలుసునన్నారు.

చిరుకు నిరసన

సీమాంధ్రలో ఉద్యమం రోజురోజుకు వేడెక్కుతోంది. సమైక్యాంధ్ర జెఏసి నేత రామారావు చిరంజీవి రాజీనామా చేయాలంటూ వినూత్న నిరసన తెలిపారు. మగమహారాజులో చిరంజీవి అకుంఠిత దీక్షతో సైకిల్ తొక్కి గెలుస్తారని, తాను ఆయన బాటలోనే నిరసన తెలుపుతున్నానని అన్నారు. మంత్రి విశ్వరూప్ ఆందోళనలో పాల్గొన్నారు. నేతలు అందరూ రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు.

English summary
Kamalapuram Congress MLA Veerasiva Reddy has blamed Central Ministers for not resigning for United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X