వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

...అమలుకు కొంత టైం: టిపై ద్వివేది, టిఎంయు నోటీసు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Janardhan Dwivedi
న్యూఢిల్లీ/విశాఖ: విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, దానిని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది బుధవారం అన్నారు. ఆయనను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల నేతలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.

ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని టి ఎంపీలకు చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలు, నాయకులు సామరస్యపూర్వకంగా ఉండాలని సూచించారు. విభజన విషయంలో ఏమైనా చెప్పదల్చుకుంటే ఆంటోనీ కమిటీ నేతృత్వంలోని కమిటీకి నివేదించాలని వారికి చెప్పారు.

మంత్రుల ఇళ్ల ముట్టడి

సీమాంధ్రలో సమైక్యవాదులు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. కేంద్రమంత్రులు పురంధేశ్వరి, జెడి శీలం, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీలు వెంకయ్య నాయుడు తదితరుల ఇళ్లను ముట్టడించారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సమ్మెకు టిఎంయు నోటీసు

ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టిఎంయు సమ్మె నోటీసు ఇవ్వనుంది. తాము 12వ తేది అర్ధరాత్రి నుండి సమ్మె చేస్తామని టిఎంయు హెచ్చరించింది. కేశినేని, దివాకర్ ట్రావెల్స్ కనుసన్నుల్లో సీమాంధ్ర ఆర్టీసి యూనియన్లు సమ్మెకు దిగుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం తెలిపింది.

సెటిలర్లు కాదు: డిఎస్

తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీమాంధ్రులు ఎవరు సెటిలర్లు కాదని, వారు తెలంగాణవారేనని మాజీ పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్ మెదక్ జిల్లాలో అన్నారు. తెలంగాణ ప్రక్రియ నిలిచిపోదన్నారు.

English summary
Congress Party senior leader Janardhan Dwivedi has told to Telangana MPs that the decision on Telangana was taken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X