వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదరికమంటే తిండి, డబ్బు కొరత కాదు!: రాహుల్‌గాంధీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదరికం అంటే ఓ మానసిక స్థితి మాత్రమేనని... తిండి, డబ్బు, వస్తువుల కొరత అని అర్థం కాదని, ఆత్మవిశ్వాసంతో అధిగమించవచ్చునని వ్యాఖ్యానించాడు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.

సంస్కృతి, "విస్తృత ప్రజాస్వామ్యం, మరింత వెనుకబడిన వర్గాలు'' అంశంపై ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ పేదరికంపై ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు అభివృద్ధి చెందడంలో స్వయం సహాయక సంఘాల పాత్రను ఈ సందర్భంగా రాహుల్ ప్రశంసించారు. పేదరికాన్ని అధిగమించేలా ఆత్మవిశ్వాసం కల్పించడంలో ఈ సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.

వ్యవస్థలోని బలహీనతను అర్థం చేసుకున్నానని, ప్రజలకు సహాయం చేయడంలో తన శక్తిమేరకు కృషి చేస్తానని చెప్పారు. అయితే, వెనుకబడిన వర్గాల ప్రజలు తమ గొంతును వినిపిస్తూ, ముందుకు రానంత వరకూ ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు. అమేథీలో ఒక పేద మహిళ ఆత్మవిశ్వాసంతో పేదరికాన్ని అధిగమించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు బాధాకరం మాత్రమే కాకుండా, పేదలను వెక్కిరించేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది.

రాహుల్ వ్యాఖ్యలపై పలువురు సామాజిక వెబ్ సైట్లలో సెటైర్లు విసిరారు. పేదరికం... మానసిక స్థితే అయితే, ప్రభుత్వం నేరుగా పలు పథకాలు ఎందుకు ప్రవేశపెడుతోందని ప్రశ్నించారు.

English summary
Congress Vice President Rahul Gandhi faced severe criticism from opposition political parties and comman man on the social media for his remarks on poverty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X