వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లెక్సీలపై మహిళా మంత్రుల ఆగ్రహం, చూస్తున్నారని...

By Srinivas
|
Google Oneindia TeluguNews

DK Aruna
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళా మంత్రులు డికె అరుణ, సునితా లక్ష్మా రెడ్డి, గీతా రెడ్డిలు గురువారం డిమాండ్ చేశారు. ఆందోళనకారులు మహిళలను అవమానపర్చేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరికాదని వారు హితవు పలికారు. ఫ్లెక్సీలలో మహిళలను అవమానంచవద్దన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం చెప్పినా ఎవరినీ ఎవరు వెళ్లగొట్టరని డికె అరుణ అన్నారు. సీమాంధ్రులు హైదరాబాదులో ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చునని చెప్పారు.

సిఎం సహా ఎవరేం చేస్తున్నారో...

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా ఎవరేం చేస్తున్నారో తమ పార్టీ అధిష్టానం చూస్తోందని గీతా రెడ్డి అన్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి అందరు కట్టుబడాల్సిందే అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యమంత్రి రెండు ప్రాంతాల సమస్యలను ప్రస్తావించారన్నారు.

సీమాంధ్రలో బడా పారిశ్రామికవేత్తలు ఉన్నందున మంచి రాజధానిని నిర్మించుకోవచ్చన్నారు. రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెసు పార్టీదే అధికారమన్నారు. సీమాంధ్రుల బాగోగులు చూసుకుంటామని, ఎవరూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దన్నారు.

విభజనలో తొలి ముద్దాయి సోనియా గాంధీయే అన్న మంత్రి టిజి వెంకటేష్‌ను కేబినెట్ నుండి తప్పించాలని శాసన మండలి సభ్యుడు యాదవ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులోని మూడు నాలుగు వేల మంది లబ్ధిదారుల కోసం కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు మరో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

English summary

 Telangana mahila ministers DK Aruna, Sunitha Laxma Reddy and Geeta Reddy were fired over flexies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X