వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాయకత్వంవల్లే, వారూ రాజీనామా: విజయరామారావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Rama Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం వల్ల ఇబ్బందితోనే తాను రాజీనామా చేశానని మాజీ మంత్రి విజయ రామారావు గురువారం అన్నారు. తనను కార్యకర్తగా పరిగణలోకి తీసుకోలేదని, అవమానించారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కడియం శ్రీహరి వస్తే తెలంగాణవాదులు వేటాడి వెంటాడారన్నారు. అలాంటి నేత పార్టీలో చేరగానే పార్టీ నిర్మాణ బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు.

మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి లాంటి నేతలకు ఎందుకు ఆ పదవి ఇవ్వలేదో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం తెలంగాణ అని, ఆ లక్ష్యం నెరవేరాక ఇక ఉద్యమం చేసే అవకాశం లేదన్నారు. హోంశాఖలో తెలంగాణ ఏర్పాటు కదలికలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అయినా కూడా కాంగ్రెసు పార్టీని నమ్మలేమని చెప్పడం ఏమాత్రం సరికాదని విజయ రామారావు అన్నారు.

విలీనం పైన కాంగ్రెసు పార్టీ పెద్దలు తెరాస అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మాట్లాడ లేదన్నారు. తనకు కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీల నుండి ఆహ్వానం వస్తోందన్నారు. తనతో పాటు ఢిల్లీకి వచ్చిన వారు కూడా తెరాసకు రాజీనామా చేస్తారని చెప్పారు.

కాగా, విజయ రామారావు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్టు బుధవారం రాత్రి ఆయన వెల్లడించారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం రాత్రి కెసిఆర్, ఎమ్మెల్యేలు కెటిఆర్, హరీశ్ రావులతో సమావేశమైన అనంతరం ఆయన ప్రకటించారు.

English summary

 Former minister and Telangana Rastra Samithi politburo member G Vijaya Rama Rao on Wednesday resgined from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X