వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో కర్నాటక ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathish Reddy
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని బొమ్మనహల్లి ఎమ్మెల్యే సతీష్ రెడ్డి కుమార్తె గగన రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి మదివాలలోని తమ ఇంటిలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. గగన వయస్సు 17. ఆమె కోరమంగళలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతోంది.

గురువారం రాత్రి సోదరితో గగన గొడవ పడిందని, ఆ తర్వాత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు చెప్పారు. గగన గదిలోకి వెళ్లిన కాసేపటికి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉంది. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం అంత్యక్రియలు జరిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా, గత నెలలో ఛత్తీస్‌గఢ్ బిజెపికి చెందిన ఎమ్మెల్యే భీమ మందాని కూతురు పద్నాలుగేళ్ల మోనా మందాని మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్టల్ భవనం పై నుండి దూకి చనిపోయిందని రాయపూర్ పోలీసులు అప్పుడు చెప్పారు. రాయపూర్‌లోని ఖమర్ది ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఇది చోటు చేసుకుందని చెప్పారు.

మోనా మయూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె మృతికి రెండు రోజుల ముందు హాస్టల్‌లో చేరింది. ఆమె వచ్చినప్పటి నుండి ఒంటరిగా ఉందని, ఎవరితోను కలవలేదని స్నేహితులు పోలీసులకు చెప్పారు.

English summary
The teenage daughter of Bommanahalli MLA, Sathish Reddy, was found hanging at their residence in Madiwala on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X