వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వార్థంతోనే విభజన: అశోక్, బాబుపై మందకృష్ణ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna
విజయవాడ/ హైదరాబాద్ : రాజకీయ నేతల స్వార్థం కోసమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని సూచించారు. సీఎం సహా మెజార్టీ మంత్రులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నాయన్నారు. విభజన అనివార్యమైతే తప్ప రాష్ట్రాన్ని విభజించకూడదని శ్రీక ృష్ణ కమిటీ సూచించిందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని అశోక్‌బాబు వెల్లడించారు.

తెలంగాణను మరోసారి అడ్డుకునేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు కుమక్కై లేఖ రాశారని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని చెబితే దేశానికి రెండో రాజధాని అంటే ఒప్పుకుంటామన్నారు.

ఆంటోని కమిటీ కాంగ్రెస్ కమిటీ అని ఆయన అన్నారు. పార్టీ నేతల కమిటీలో సీమాంద్రుల అనుమానాలు తీర్చాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రత్యేక చట్టం తేవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

తెలంగాణపై చంద్రబాబు మళ్లీ రంగులు మార్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినోద్ ఆరోపించారు. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖపై తెరాస మండిపడింది. తెలంగాణను అడ్డుకోవడమే చంద్రబాబు, సీఎం కిరణ్ పని అని విమర్శించారు. సమస్యలు చెప్పడం కాదు...పరిష్కారం చూపాలన్నారు. సీమాంధ్రలో రాజకీయ ఆదిపత్య పోరు సమ్మె జరుగుతోందని వినోద్ వ్యాఖ్యానించారు.

English summary

 AP NGOs leader Ashok babu has opposed the decission of bifurcation of Andhra Pradesh. MRPS leader lashed out at Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X