వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిని వదిలేసి కాంగ్రెసుపైనా..: విభజనపై టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు/ హైదరాబాద్: రాష్ట్ర విభజనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, సిపిఐ కార్యదర్శి కె. నారాయణను వదిలేసి కాంగ్రెసుపై విమర్శలు చేయడం తగదని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. రాష్ట్ర విభజనకు వారు ముగ్గురు కారణమని, వారిని వదిలేసి కాంగ్రెసును దూషించడం సరి కాదని ఆయన శనివారం కర్నూలులో అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే తలెత్తే సమస్యలను సిఎం చెప్పడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. కోర్ కమిటీకి సమర్పించిన రోడ్ మ్యాప్‌లో చెప్పిన విషయాలనే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు, శానససభ్యులు చెప్పిన విషయాలను డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎలా చెప్పారో, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన సమర్థించారు.

TG Venkatesh

అభిప్రాయాలను వెల్లడించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులకు ఉన్న స్వేచ్ఛ సీమాంధ్ర మంత్రులకు లేదా అని ఆయన అడిగారు. సమైక్యాంధ్రకు కట్టుపడిన రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం సరి కాదని ఆయన అన్నారు.

తెలంగాణ నేతలపై కొండ్రు గుర్రు

ముఖ్యమంత్రిపై తెలంగాణ కాంగ్రెసు నేతలు విమర్శలు చేయడం అర్థరహితమని ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి అన్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అవి జైపాల్ రెడ్డి వంటి పెద్ద మనిషి మాట్లాడే మాటలు కావని ఆయన అన్నారు. పొన్నం మాటలు గర్హనీయమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జలయజ్ఝంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత సంపాదించుకున్నారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. కొందరు తెలంగాణ కాంగ్రెసు నేతలు సీమాంధ్ర నేతలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలంగాణ నేతలు మూకుమ్మడిగా మాట్లాడడాన్ని ఆయన ఖండించారు.

ముఖ్యమంత్రిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తాను ఏం మాట్లాడుతున్నారో కెసిఆర్‌కే తెలియదని ఆయన అన్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ రెండు ప్రాంతాల్లో మాట్లాడేది వేర్వేరు భాష అని, ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడేది ఒక్కటే భాష అని, ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ గల కాంగ్రెసు కార్యకర్త అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాస్తవాలే మాట్లాడారని, కాంగ్రెసు అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని మరో మంత్రి బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి మాటలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.

English summary
Minister from Rayalaseema TG Venkatesh said that it is not correct to blame congress on Andhra Pradesh bifurcation, leaving YS Vijayamma, Nara Chandrababu Naidu and Narayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X