తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో సమైక్యవాణి, దీక్షబూనిన మంత్రి భార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Samaikyandhra
కరీంనగర్/విజయవాడ/కాకినాడ: సమైక్యాంధ్ర కోసం తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభమైన మోటార్ బైక్ యాత్ర శనివారం కృష్ణా జిల్లా నందిగామకు చేరుకుంది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో జోరుగా ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమగడ్డ కరీంనగర్ నుండి సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ పలువురు జర్నలిస్టులు కరీంనగర్ నుండి తిరుపతికి బైక్ యాత్ర చేపట్టారు.

ఇది శనివారం కృష్ణా జిల్లాకు చేరుకున్నప్పుడు ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వర రావు, తంగిరాల ప్రభాకర రావులు తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కరీంనగర్ జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పర్కాల సమ్మయ్య డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ స్వార్థం కోసం రాష్ట్ర విభజన జరగడం బాధాకరమని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు పదవులు, అక్రమ ఆదాయం కోసం రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆరోపించారు. ఆయన స్వార్థానికి ఎంతోమంది విద్యార్థులు బలయ్యారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

ఉద్యమంలో మంత్రి భార్య

సమైక్యాంధ్ర ఉద్యమంలో మంత్రి తోట నర్సింహం కుటుంబ సభ్యులు పాలుపంచుకుంటున్నారు. నిరసన కార్యక్రమాల్లో మంత్రి ఇప్పటికే బిజీగా ఉంటున్నారు. శనివారం ఆయన భార్య వాణి, కుమార్తె ప్రసన్నలు కూడా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బానుగుడి చౌరస్తాలో తోట వాణి శనివారం ఉదయం నిరవధిక దీక్షకు కూర్చున్నారు.

విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దీక్ష కొనసాగుతుందని వాణి స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర ఐక్యత కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని మంత్రి తనయ తోట ప్రసన్న విలేకరులతో చెప్పారు. తన తల్లిదండ్రులే కోకా తాత కూడా ఉధ్యమంలో భాగస్వాములయ్యారని చెప్పారు.

English summary
Karimnagar district journalists takeup bike rally 
 
 for Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X