వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా గ్యాస్ తీసుకుంటూ టికి మద్దతా?: మోడీకి తోట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Thota Narasimham
కాకినాడ/విజయనగరం: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ కాకినాడ నుండి వేలకోట్ల గ్యాస్ కొల్లగొడుతూ తెలంగాణకు మద్దతిస్తున్నారని మంత్రి తోట నర్సింహం శుక్రవారం మండిపడ్డారు. జిఎస్‌పిఎల్ కార్యకలాపాలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు.

సీమాంధ్రులను రెచ్చగొట్టేలా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశఖర రావు, ఇతర తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది వారి అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు.

రాజీనామా చేయను కానీ: బొత్స ఝాన్సీ

సమైక్యాంధ్రకు మద్దతుగా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని విజయనగరం ఎంపి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి తేల్చిచెప్పారు. శనివారం విజయనగరంలో ఎపిఎన్జీవో సంఘం జిల్లాశాఖ నేతలు ఆమెను కలిసి ఎంపి పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీనిపై ఆమె స్పందించారు.

రాజీనామా చేయనని అయితే, సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంటులో తన వాణి వినిపిస్తానని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో సమైక్య ప్లకార్డు పట్టుకోవడానికి నిరాకరించడాన్ని ఝాన్సీలక్ష్మి సమర్ధించుకున్నారు. ప్లకార్డులు పట్టుకునే సంస్కృతి తనది కాదని ఆమె వ్యాఖ్యానించారు.

English summary
Minister Thota Narasimham has participated in Samaikyandhra agitation on 12th day in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X