వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు చుక్కలు: లగడపాటి, ఎకె కమిటిపై టిఎస్సార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ/విశాఖ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చుక్కలు చూపిద్దామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం అన్నారు. ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సమైక్య ఉద్యమం బలంగా ఉంటే రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదన్నారు.

హైదరాబాదు ఏ ఒక్కరిదీ కాదని, కలిసికట్టుగా అందరం అభివృద్ధి చేసుకున్నామన్నారు. విభజన జరిగితే నీటి సమస్యలు తలెత్తుతాయన్నారు. సీమాంధ్ర ప్రాంతం ఉద్యోగ అవకాశాలు కోల్పోతుందన్నారు. అంతా తెలంగాణకే పోతే సీమాంధ్ర ప్రాంతం ఎడారవుతుందన్నారు. సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయన్నారు.

కెసిఆర్‌కు చుక్కలు చూపించే సమయం వచ్చిందన్నారు. అందరం కలిసి తెలుగు తల్లిని కాపాడుకోవాలన్నారు. తాము సమైక్యానికే కట్టుబడి ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకటించే రోజు వస్తుందన్నారు. నేతల రాజీనామాలతో పాటు సమైక్యవాదం కూడా బలంగా వినిపించాలన్నారు.

ఐక్యంగా ఉండాలని భావిస్తున్నాం: శైలజానాథ్

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము భావిస్తున్నామని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. ప్రజాప్రతినిధులుగా తాము సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎల్లుండి తాము ధర్నా చేస్తామన్నారు. చర్చలు లేవనే దగ్గరి నుండి తాము చర్చల వరకు తీసుకు వచ్చామని, అలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామన్నారు.

సోనియా దృష్టికి తీసుకు వెళ్లాం: టిఎస్సార్

సమైక్యాంధ్ర ఆందోళనను తాము ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లామని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి అన్నారు. ఆంటోనీ కమిటీలో తెలుగు వారు లేకపోవడం బాధాకరమైనా, సీనియర్లు ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదన్నారు.

24 మంది సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజీనామా చేసి రోడ్ల పైకి వచ్చేకంటే సభలో కార్యకలాపాలు అడ్డుకోవడం వల్ల ఫలితం ఎక్కువుంటుందన్నారు. ఆంటోనేయే కాదు ఏ కమిటీలను నమ్మి సీమాంధ్ర ప్రజలు మోసపోరన్నారు. హైదరాబాదును సీమాంధ్ర నుండి వేరు చేస్తే పల్నాటి పౌరుషం చూపిస్తామన్నారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal on Sunday said Seemandhra will teach lesson to TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X