వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కెసిఆర్ ఆటంకం కల్గించారు': కాంగ్‌లోకి ఇద్దరు మాజీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Ramarao
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఉధృతమైన పలు సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి విజయ రామారావు సోమవారం ఆరోపించారు. విజయ రామారావు, మరో మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్‌లు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

తాము కాంగ్రెసు పార్టీలో చేరుతున్నామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు పార్టీకి అండగా నిలబడేందుకే తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరుతున్నట్లు చెప్పారు. కెసిఆర్ పార్టీని విలీనం చేస్తారని భావిస్తున్నామన్నారు. తెలంగాణ వస్తేనే ఇరు ప్రాంతాల్లో దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్రలో ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెసుకు మద్దతివ్వాల్సిన అవసరముందన్నారు.

తెరాస పొలిట్ బ్యూరో ఏర్పాటు తన కృషి ఫలితమేనని ఎ చంద్రశేర్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసుకు అండగా ఉండాలని ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. సీమాంధ్ర నేతలు, ప్రజలు విభజనకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక రాష్ట్రం కోసమే పుట్టిందని, ఈ విషయాన్ని కెసిఆర్ కూడా పలు సందర్భాలలో చెప్పారన్నారు.

తెలంగాణ ఏర్పాటు దశలో ప్రాథమిక చర్చలు జరుగుతున్నప్పటి నుండి తెరాస పార్టీ లక్ష్యం, గమ్యం రాష్ట్రం సాధించుకోవడమే అన్నారు. అది సాధ్యమైనందున తెరాసను కూడా విలీనం చేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందరితో కలిసి పని చేశామన్నారు.

English summary
Telangana Rastra Samithi senior leaders, former ministers A.Chandrasekhar and Vijaya Ramarao set to join in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X