హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలక్ష్మిపై సిబిఐకోర్టు ఆగ్రహం, జగన్ రిమాండ్ పొడిగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టుకు హాజరు కాని ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఎంసి కేసులో నిందితుడైన గనుల శాఖ మాజీ ఎండి రాజగోపాల్ కోర్టుకు వచ్చారు.

శ్రీలక్ష్మి హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలక్ష్మి కోర్టుకు హాజరు కావాలని సూచించింది. హాజరు కాని పక్షంలో మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలని జడ్జి ఆమెను ఆదేశించారు.

కోర్టుకు సబితా, ధర్మానలు హాజరు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, ఇతరులు కూడా సిబిఐ కోర్టుకు ఈ రోజు ఉదయం హాజరయ్యారు.

రిమాండు పొడిగింపు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసులలో నిందితులకు సిబిఐ కోర్టు రిమాండును ఈ నెల 26వ తేది వరకు పొడిగించింది. ఈ కేసులలో జగన్‌తో పాటు పలువురు ఇప్పటికే జైలులో ఉన్నారు. వారందరి రిమాండును కోర్టు పొడిగించింది.

English summary
A special CBI court here today extended till August 26, the judicial remand of YSR Congress Party chief YS Jaganmohan Reddy and other accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X