వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌పై చిరు, రాష్ట్రపతి పాలన ఉండదని బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Botsa Satyanarayana
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాదును ఏవిధంగా కాపాడాకోవాలన్న దాని పైన ఆలోచిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మంగళవారం అన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ఢిల్లీ తరహా ఉంచాలని ప్రయత్నిస్తున్నామని, తమ ప్రయత్నాలు సఫలమవుతాయనుకుంటున్నామని చెప్పారు. విభజనపై సీమాంధ్ర ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు.

విభజన నేపథ్యంలో అందరికీ సమ న్యాయం కావాలన్నారు. ఎకె ఆంటోనీ కమిటీకి తమ డిమాండ్లను, సమస్యలను వివరిస్తామని చెప్పారు. ఆంటోని కమిటీకి సమస్యలు వివరించినా ఎలా అమలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వపరంగా కమిటీ వేస్తే కమిట్‌మెంట్ ఉంటుందన్నారు. హైదరాబాదుతో భవిష్య్తత్తు ముడివడి ఉందని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు నీరు పెద్ద సమస్యగా మారనుందన్నారు.

రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు: బొత్స, ఢిల్లీకి ప్రయాణం

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రులే కాకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ తమ అభిప్రాయం చెప్పారన్నారు. ఆంటోనీ కమిటీకి ప్రజల సందేహాలను తాము వివరిస్తామని చెప్పారు. ఆర్టీసి కార్మికులు దయచేసి సమ్మెను విరమించుకోవాలని కోరారు.

కార్మికుల ఆకాంక్షను తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. విభజన ఓట్లు, సీట్ల కోసం జరగలేదన్నారు. కాంగ్రెసు పార్టీ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందన్నారు. సమ్మె వల్ల ప్రజా జీవనం స్తంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడు కాంగ్రెసు పైన నెపం వేయడం సరికాదన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము ఆఖరి వరకు ఉద్యమిస్తామన్నారు. కాగా బొత్స ఈ రోజు ఢిల్లీకి బయలుదేరారు.

సమ్మెపై సిఎం సమీక్ష

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమ్మెపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉద్యోగుల హాజరు శాతంపై ఆరా తీశారు. తిరుమల కొండ పైన ఉన్న భక్తులను కిందకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

English summary
Central Toursim Minister Chiranjeevi on Tuesday said Hyderabad should be a Union Territory or the Delhi model capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X