వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటోగ్రఫీ దినోత్సవం: బెస్ట్ న్యూస్ పిక్చర్స్ (ఫోటోలు)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆగస్టు 19వ తేదిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన 'బెస్ట్ న్యూస్ పిక్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' కేటగిరీ రాష్ట్ర స్థాయి పోటీలలో మొదటి బహుమతి సుమన్ రెడ్డిని, రెండో బహుమతి ఆవుల శ్రీనివాస్‌ను, మూడో బహుమతి శివ ప్రసాద్‌ను వరించింది. మరో పది మంది కన్సోలేషన్ బహుమతులు దక్కించుకున్నారు. వీరికి ఈ నెల 19వ తేదిన బహుమతులు ప్రదానం చేస్తారు.

న్యూస్ కేటగిరీలతో పాటు బంగారుతల్లి, అమ్మహస్తం, ఇందిరమ్మ కలలు, బడి బాట, రాజీవ్ యువ కిరణాలు, మహిళా లోకం కేటగిరీలోను పోటీలు జరిగాయి. మొదటి బహుమతికి రూ.15వేలు, రెండో బహుమతికి రూ.10వేలు, మూడో బహుమతికి రూ.6వేలు, కన్సోలేషన్ బహుమతులకు రూ.3వేలు చొప్పున ఇవ్వనున్నారు. బహుమతులు పొందిన వారు పలు తెలుగు, ఆంగ్ల దిన పత్రికలకు చెందిన ఫోటో జర్నలిస్టులు.

మన రాష్ట్రంలో 1965లో శ్రీ రాజాత్రయంబక రాజాబహదూర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ ఫెడరేషన్ ఏర్పడింది. 1975లో అమెరికన్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రం నుండి బండి రాజన్ బాబు అనే ఫోటోగ్రాఫర్ పాల్గొని ప్రపంచస్థాయిలో ప్రథమ బహుమతిని పొందారు.

బాంబు పేలుడు

బాంబు పేలుడు

ఈ ఏడాది ఫిబ్రవరి 21వ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఈ ఫోటోకుగాను డి సుమన్ రెడ్డికి మొదటి బహుమతి వచ్చింది.

చార్మినార్ వద్ద భద్రత

చార్మినార్ వద్ద భద్రత

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద పోలీసు పహారా దృశ్యం. దీనికి రెండో బహుమతి వచ్చింది. ఆవుల శ్రీనివాస్ తీసిన ఫోటో ఇది.

సిటీలైట్ హోటల్

సిటీలైట్ హోటల్

గత నెలలో సికింద్రాబాదులోని సిటీలైట్ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు. ఈ ఫోటోను కె శివప్రసాద్ తీశారు. దీనికి మూడో బహుమతి వచ్చింది.

కన్సోలేషన్ 1

కన్సోలేషన్ 1

'బెస్ట్ న్యూస్ పిక్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' కేటగిరీలో వైజాగ్‌కు చెందిన కెఆర్ దీపక్‌కు ఈ ఫోటోకు గాను కన్సోలేషన్ బహుమతి వచ్చింది. ఈనెల 19వ తేదిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.

కన్సోలేషన్ 2

కన్సోలేషన్ 2

'బెస్ట్ న్యూస్ పిక్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' కేటగిరీలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్ హరిగంగాధర్‌కు ఈ ఫోటోకు గాను కన్సోలేషన్ బహుమతి వచ్చింది.

 కన్సోలేషన్ 3

కన్సోలేషన్ 3

'బెస్ట్ న్యూస్ పిక్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' కేటగిరీలో హైదరాబాద్‌కు చెందిన ఎన్ శివకుమార్‌కు ఈ ఫోటోకు గాను కన్సోలేషన్ బహుమతి వచ్చింది.

కన్సోలేషన్ 4

కన్సోలేషన్ 4

రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీకాంత్ ఫోటోకు 'బెస్ట్ న్యూస్ పిక్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' కేటగిరీలో కన్సోలేషన్ బహుమతి వచ్చింది. ఈ బహుమతులను ఈ నెల 19వ తేదిన ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున ప్రదానం చేయనున్నారు.

కన్సోలేషన్ 5

కన్సోలేషన్ 5

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన టి వీర భగవాన్ చిత్రానికి కన్సోలేషన్ బహుమతి వచ్చింది. వరదల కారణంగా నీట మునిగిన గుడిసెల దృశ్యం

కన్సోలేషన్ 6

కన్సోలేషన్ 6

'బెస్ట్ న్యూస్ పిక్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' కేటగిరీలో వైజాగ్‌కు చెందిన వై రామక్రిష్ణన్ తీసిన ఈ ఫోటోకు గాను కన్సోలేషన్ బహుమతి వచ్చింది. తన కెమెరాలో కుక్కను బందిస్తున్న యువతి దృశ్యం

కన్సోలేషన్ 7

కన్సోలేషన్ 7

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఎస్ రమేష్ బాబు తీసిన ఈ ఫోటోను కన్సోలేషన్ బహుమతి వరించింది. ప్రమాదకర స్థాయిలో వీధిలైట్ల మరమ్మతు చేస్తున్న దృశ్యం

 కన్సోలేషన్ 8

కన్సోలేషన్ 8

వైజాగ్‌కు చెందిన ఎ శరత్ కుమార్ తీసిన ఫోటో ఇది. దీనికి కన్సోలేషన్ బహుమతి వచ్చింది. ఆడపిల్లలను కాపాడే విధంగా చట్టాలు మరిన్ని తీసుకు రావాలని యువతులు ఆందోళన చేస్తున్న దృశ్యం

కన్సోలేషన్ 9

కన్సోలేషన్ 9

'బెస్ట్ న్యూస్ పిక్చర్స్ ఆఫ్ ఆంద్రప్రదేశ్' కేటగిరీలో హైదరాబాదుకు చెందిన సిహెచ్ ప్రభుదాస్ తీసిన ఈ చిత్రానికి కన్సోలేషన్ బహుమతి వచ్చింది.

కన్సోలేషన్ 10

కన్సోలేషన్ 10

హైదరాబాదుకు చెంది ఆర్ రాఘవేందర్ తీసిన చిత్రం ఇది. దీనికి కన్సోలేషన్ బహుమతి వచ్చింది. ఈ బహుమతులను ఈ నెల 19న ప్రదానం చేయనున్నారు. ఆగస్ట్ 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.

English summary
The Results of State lelvel Competition on Photography were came.These are the "Best News Pictures of Andhrapradesh" Category (Salon3) In the Statelelvel Contest held in connection with world Photography day i.e 19th of August. The Prize Distribution will be held on 19th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X