వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రతకు మంత్రులది హామీ, రెచ్చగొట్టవద్దు: జానా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తెలంగాణలో ఎపిఎన్జీవోల ఉద్యోగ భద్రతకు తమ ప్రాంత మంత్రులమంతా హామీ ఇస్తున్నామని, ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి బుధవారం విజ్ఢప్తి చేశారు. సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. విభజన జరిగినా భద్రత, సర్వీస్ రూల్స్‌కు ఇబ్బందులు ఉండవని ఆయన చెప్పారు.

విడిపోయి కలిసుందామన్నారు. ఎపిఎన్జీవోల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని, రాబోయే ఇరు ప్రభుత్వాలు పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తాయన్నారు. రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిస్తుందామన్నారు. పరస్పర సహకారంతో ఇరు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని కోరారు.

ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పాలన్నారు. 56 ఏళ్లుగా కలిసున్న ఉద్యోగులంతా తెలుగు కుటుంబంలోని వారే అన్నారు. టిఎన్జీవోలు, ఎపిఎన్జీవోల మధ్య సయోధ్య నెలకొల్పాల్సిన అవసరముందన్నారు. ఎపిఎన్జీవోలు, సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు.

వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధి దృష్ట్యా పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రమని, అందరిదీ అన్నారు. ఎవరూ ఆందోళనకర పరిస్థితులు సృష్టించవద్దని చెప్పారు. ఇరు ప్రాంత ఉద్యోగులు దూషణలకు దిగవద్దని కోరారు.

ఉద్యమం విరమించండి: పొన్నాల

సీమాంధ్ర ప్రజలు ఉద్యమాన్ని విరమించాలని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్లో అన్నారు. 56 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ నిర్ణయం వచ్చిందన్నారు.

స్పాన్సర్డ్ ఉద్యమం: సచివాలయ టి ఉద్యోగ నేత నరేందర్ రావు

సమైక్యాంధ్ర ఉద్యమం స్పాన్సర్డ్ ఉద్యమమని, కలిసి పని చేసే వాతావరణాన్ని చెడగొట్టవద్దని సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత నరేందర్ రావు వేరుగా మండిపడ్డారు. ఎపిఎన్జీవోలు సమ్మె నోటీసు ఇచ్చినా సిఎస్ పట్టించుకోలేదన్నారు. లెక్కలతో వస్తే వాస్తవాలు తెలుస్తాయని, ఆందోళన ఆపకుంటే తాము నిరసన తెలుపుతామన్నారు. డిపార్టుమెంట్లలో తమను శత్రువుల్లా చూస్తున్నారన్నారు.

English summary
Minister Jana Reddy and Telangana Ministers on Wednesday promised APNGOs and Seemandhra people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X