వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ ఎఫెక్ట్: సీమాంధ్ర బరిలో సినీ స్టార్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తెలుగు సినీ స్టార్స్‌ను తెర మీదికి తెచ్చింది. సీమాంధ్ర సినీ తారలను ఎన్నికల బరిలోకి దింపి సత్తా చాటాలనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణవాదాన్ని సమర్థించిన నేపథ్యంలో దాని ప్రభావం సీమాంధ్రలో పడకుండా తెలుగు సినీ ప్రముఖులను రంగంలోకి దింపే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగం చేసి బిజెపి కొంత మేరకు విజయం సాధించింది.

మోడీని కలిసినవారిలో రామ్ గోపాల్ వర్మ, కె. రాఘవేంద్ర రావు, దగ్గుబాటి రానా, మోహన్ బాబు ఉన్నారు. మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మిప్రసన్న, కుమారులు విష్ణు, మనోజ్‌లతో కలిసి మోడీతో భేటీ అయ్యారు. కృష్ణంరాజు, కోట శ్రీనివాస రావు, అలీ, గౌతమి, ఎంఎం కీరవాణి, వివి వినాయక్ తదితరులు మోడీని కలిశారు.

Narendra Modi

మోడీని కలిసినవారిలో చాలా మంది పేర్లను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపడానికి పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోవడం తమకు సులభమేనని, సీమాంధ్రలో కాస్తా ఇబ్బంది ఎదురవుతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. సినీ ప్రముఖులను మోడీ వద్దకు చేర్చింది బిజెపి రాష్ట్ర సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర రావు అని చెబుతున్నారు.

అయితే, మోడీని కలిసినవారిలో ఎంత మంది బిజెపి తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతారో చెప్పడం కష్టమే. మోహన్ బాబు, ఆయన కూతురు లక్ష్మిప్రసన్న మాత్రం వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో తమకు అనువైన సీట్ల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మోహన్‌బాబును తమ పార్టీ తరఫున పోటీకి దింపేందుకు బిజెపి నేతలు ప్రయత్నించవచ్చు.

మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కృష్ణంరాజు బిజెపి తరఫున పోటీ చేసి రెండు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. వాజ్‌ప్రేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు .ఆయనను కాకినాడ లేదా నర్సాపూర్ లోకసభ స్థానం నుంచి పోటీకి దింపే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

కోట శ్రీనివాస రావు గతంలో బిజెపి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన వచ్చే ఎన్నికల్లో విజయవాడ (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.

English summary
Mohan Babu, who was Rajya Sabha member from the Telgu Desam Party (TDP), is also said to be weighing options. Krishnam Raju, who had been elected twice as a BJP candidate and minister in the Atal Bihari Vajapayee cabinet, is likely to make a comeback.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X