వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబ్ కమిటీ చర్చలు విఫలం, కోర్టులో పిల్ (ఫోటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సమైక్యవాదం డిమాండ్‌తో ఎపి ఎన్జీవోలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్జీవోలతో బుధవారం కేబినేట్ సబ్‌కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమావేశానంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో సమ్మె యథాతథంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రేపు(గురువారం) జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని మంత్రి వర్గ సబ్ కమిటీ కోరిందని, వేడుకల్లో పాల్గొంటామని చెప్పారు. కాగా ఈనెల 16న గుంటూరులో ఏపీ ఎన్జీవోల భేటీ జరగనుంది.

తిరుపతిలో సమైక్య సెగ

తిరుపతిలో సమైక్య సెగ

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆందోళలు పెల్లుబుకుతున్నాయి. తిరుపతిలో వినూత్న రీతిలో సమైక్యవాదులు ఆందోళన చేస్తున్నారు. మాస్క్‌లు ధరించి వారు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యవాదాన్ని వినిపిస్తూ ఆందోళనకు దిగారు.

మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు

మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు

ఎపి ఎన్జీవోల సమ్మెకు పరిష్కారం కనుక్కోవడానికి మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులు చర్చలు జరిపారు. వారి చర్చలు ఫలించలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామనే ప్రకటన వచ్చే వరకు ఆందోళన సాగిస్తామని చెబుతున్నారు.

సమ్మెను ఉధృతం చేస్తాం

సమ్మెను ఉధృతం చేస్తాం

మంత్రివర్గ ఉప సంఘంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సమ్మెను ఉధృతం చేస్తామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాత్రం సహకరిస్తామని చెప్పారు.

సచివాలయంలో ఆందోళన

సచివాలయంలో ఆందోళన

సమైక్యవాదంతో ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర సచివాలయంలో ఆందోళనకు దిగారు. వారు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెను కొనసాగిస్తామని అంటున్నారు.

సచివాలయంలో ఆందోళన

సచివాలయంలో ఆందోళన

సమైక్యవాదంతో ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర సచివాలయంలో ఆందోళనకు దిగారు. వారు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెను కొనసాగిస్తామని అంటున్నారు.

ప్రకాశం జిల్లాలో సమైక్యవాదం

ప్రకాశం జిల్లాలో సమైక్యవాదం

సమైక్యవాదంతో ప్రకాశం జిల్లాలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రకాశం జిల్లా ప్రజలు కోరుతున్నారు. వారి ప్రదర్శన వినూత్నంగా సాగుతోంది.

సమైక్యానికి పొట్టి శ్రీరాములు

సమైక్యానికి పొట్టి శ్రీరాములు

సమైక్య నినాదానికి పొట్టి శ్రీరాములు ఆదర్శంగా నిలిచాడు. ఆయన విగ్రహాలకు సమైక్యవాద ఆందోళనకారులు నివాళులు అర్పిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ భీమా భవన్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా భీమా భవన్‌లో సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు 'సీమాంధ్ర ఉద్యోగులు గో బ్యాక్ ' అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఇదిలావుంటే, ఎపి ఎన్జీవోల సమ్మెను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. రవికుమార్ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చేశారు. డిజిపిని, ఎపి ఎన్జీవోల సంఘాన్ని ఆయన ప్రతివాదులుగా చేర్చారు. సమైక్య ఉపాధ్య సంఘం కార్యకర్తలు ఈ నెల 16, 17 తేదీల్లో సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

English summary
Cabinet sub committee members talks with APNGOs to end strike failed. APNGOs president Ashok Babu said that strike will continue and they will meet AK Antony committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X