వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా ఆఖరి అస్త్రం, టి తీర్మానం ఓడించాకే..: వట్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar
ఏలూరు: సమైక్యాంధ్ర కోసం తాము రాజీనామాలకు వెనుకాడటం లేదని అయితే, అది ఆఖరి అస్త్రమని మంత్రి వట్టి వసంత్ కుమార్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా గనపవరంలో అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఓడించాక రాజీనామా చేస్తానన్నారు. పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏమీ చేయలేదనడం సరికాదన్నారు. వాళ్ల ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారని వివరణ ఇచ్చారు.

పార్లమెంటులో చర్చను వ్యతిరేకించేందుకే వారు రాజీనామాలు చేయడం లేదన్నారు. పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని వట్టి కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టినా ఇతర ప్రాంతాల, రాష్ట్రాల నేతలు వ్యతిరేకిస్తారన్నారు.

మెజార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి ఎప్పుడైనా విలువ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లు పెడితే ములాయం సింగ్ ఆధ్వర్యంలోని సమాజ్‌వాది, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె తదితర పార్టీలు విభజనను వ్యతిరేకిస్తాయన్నారు.

మంత్రి పదవులకు రాజీనామా చేస్తే లాభముండదన్నారు. అందరు రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే దృఢ నమ్మకం తమకుందన్నారు. రాజీనామాలు ఆఖరుగా ప్రయోగించాల్సిన అస్త్రమన్నారు. మంత్రులు కూడా రాజీనామా చేయడం లేదన్నారు. అయితే ఎపిఎన్జీవోలు రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో.. అసెంబ్లీలో బిల్లు ఓడించాక రాజీనామా చేస్తానని వారికి చెప్పారు.

English summary
Minister Vatti Vasanth Kumar on Wednesday said resignation is the last weapon to keep United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X