వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ముంబై చాలాదూరం.. గడ్చిరోలిని తెలంగాణలో కలపండి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
ముంబై: గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలని నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్సీపి) నేత ధర్మారావు బాబా ఆత్రమ్ మంగళవారం డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ డిమాండు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలు మహారాష్ట్ర రాజధాని ముంబైతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదుకు చాలా దగ్గర అని ఆయన చెబుతున్నారు.

ఈ జిల్లాల నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు సుమారు నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని, అదే ముంబైకి వెళ్లాలంటే మాత్రం ఎనిమిది గంటలకు పైగా పడుతుందని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా తెలుగు మాట్లాడే వారు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలను తెలంగాణ ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో కలపాలన్నారు.

ఆర్పీఐ చీఫ్ రామదాస్ అథవాలే విదర్బ ప్రత్యేక రాష్ట్రంపై రెఫరెండం పెట్టాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేశారు. రామదాస్ రెఫరెండమ్ డిమాండు తర్వాత రోజే ఎన్సీపి నేత ధర్మారావు విభజన చేయకుంటే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకు రావడం గమనార్హం.

కాగా, ఆంధ్రప్రదేశ్ విభజనకు అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుండి కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షురులు రామదాస్ మాట్లాడుతూ... తిరుపతి తమదేనని, దానిని తమిళనాడులో కలపాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

English summary
NCP leader Dharmarao Baba Atram said that if a separate state is not carved out of Maharashtra, then Gadchiroli and Chandrapur districts should be included in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X