వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘువీరా రెడ్డికి సమైక్య సెగ: బెజవాడలో నిరసనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
అనంతపురం/ విజయవాడ: అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరారెడ్డికి గురువారంనాడు సమైక్య సెగ తగిలింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి రఘువీరారెడ్డిని న్యాయవాదుల అడ్డుకునేందుకు యత్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రఘువీరా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

కాగా, స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి రఘువీరా రెడ్డి ఎదుట ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి సమైక్య గళం వినిపించారు. అయితే అదేమీ పట్టించుకోకుండా మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించగా, గుర్నాథ్‌రెడ్డి తనకు కేటాయించిన విఐపి సీట్లోకి వెళ్లి కూర్చున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో కొనసాగుతున్నాయి. విజయవాడలో మూడో రోజు ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.

విశాఖపట్నం ంజిల్లాలో ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి వంటావార్పూ చేపట్టింది. మద్దెలపాలెం సెంటర్‌లో తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలకు 106 బస్సు సర్వీసులను నడుపుతున్నారు.

ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలో ఆమరణ దీక్ష చేస్తున్న మంత్రి తోట నర్సింహం సతీమణి వాణి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. వాణి దీక్షా శిబిరం వద్ద పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. మంత్రి వట్టి వసంతకుమార్‌కు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో సమైక్య సెగ తగిలింది.

English summary
Advocates tried to obstruct minister Raghuaveera Reddy at Ananthapur demanding Unified Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X