వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతాలు రాకుంటే దెబ్బ: టిజి, మీడియాకు బొత్స క్లాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 on Friday suggested media over agitations.
హైదరాబాద్/కర్నూలు: రెండు నెలలు జీతాలు రాకపోతే ఎపిఎన్జీవోల ఉద్యమం దెబ్బతింటుందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ శుక్రవారం అన్నారు. కర్నూలులోని పాతనగరంలో చిన్న వ్యాపారుల సంఘం నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో టిజి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎపిఎన్జీువోల సమ్మెకు ఇది తగిన సమయం కాదని, వారు పునరాలోచించుకోవాలని కోరారు.

మీడియాకు బొత్స క్లాస్

తెలంగాణపై రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం వేరుగా అన్నారు. ఆయన మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు సూచనలు చేశారు. మీడియా పర్సనల్ అజెండా తగ్గించుకోవాలని హితవు పలికారు.

ఉద్యమాల విషయంలో మీడియా తీవ్రతను తగ్గించాలన్నారు. గతంలోను ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు. మీడియా కొంత సంయమనం పాటిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆంటోని కమిటీకి, తెలంగాణ ప్రక్రియకు సంబంధం లేదన్నారు. ఈ నెల 19న తాము ఆంటోనీ కమిటీని కలుస్తామని తెలంగాణ ప్రాంత నేతలు చెప్పారన్నారు.

19న ఆంటోని కమిటీ ముందుకు తెలంగాణ నేతలు

ఈ నెల 19వ తేదిన తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు ఆంటోనీ కమిటీని కలవాలని నిర్ణయించుకున్నారు. పలువురు తెలంగాణ నేతలు బొత్సతో భేటీ అయ్యారు. అనంతరం దానం మాట్లాడుతూ... కమిటీని కలిసే విషయమై సమావేశంలో చర్చించామన్నారు. అనేక అనుమానాలు వస్తున్న దృష్ట్యా హైదరాబాద్ మంత్రులంతా కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తామన్నారు.

హైదరాబాద్ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఆంధ్రా ప్రాంత ప్రజల్లో నెలకొన్న సమస్యలు, అపోహలపై ఆంటోనీ కమిటీకి స్పష్టత ఇస్తామని మరో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

English summary
Pradesh Congress Committed chief Botsa Satyanarayana on Friday suggested media over agitations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X