వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల నుంచి తప్పుకుంటా: విభజనపై కోట్ల

By Pratap
|
Google Oneindia TeluguNews

Kotla Suryaprakash Reddy
న్యూఢిల్లీ/ హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాయలసీమకు చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రకటించారు. విభజన అంటూ చేస్తే రాష్టాన్ని మూడుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే తుంగభద్ర నదీ జలాల విషయంపై కర్ణాటకతో వివాదం ఉందని, రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ఎడారి అవుతుందని ఆయన అన్నారు.

తమది పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదని, తాను ఇతర పార్టీల్లో చేరబోనని ఆయన చెప్పారు. విభజన జరిగితే ఆంధ్ర, తెలంగాణలకు ఏ విధమైన నష్టం ఉండదని, రాయలసీమ ప్రాంతమే పూర్తిగా నష్టపోతుందని ఆయన అన్నారు.

ఎపి ఎన్జీవోలకు, ఉద్యోగులకు మద్దతుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో తానూ పాల్గొంటానని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాయపాటి సాంబశివ రావు రాజీనామా చేశారు.

కాగా, సీమాంధ్రుల అంగీకారం లేకుండా రాష్ట్ర విభజన జరగదని రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆస్పత్రిలో చేరిన తోట వాణిని ఆయన శుక్రవారంనాడు పరామర్శించారు.

English summary
Railway minister of state Kotla Suryaprakash reddy said that he will quit politics, if bifurcation takes place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X