హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమమే రాజ్యాంగ విరుద్ధం, సిటీ హక్కుమాదే: కోదండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకమని, హైదరాబాదు పైన తెలంగాణకే హక్కుండాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై వచ్చిన ప్రకటనను పార్లమెంటులో బిల్లు వైపు కదిలించే దిశగా తమ ఉద్యమం కొనసాగుతుందని ఐకాస ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ఇందిరాపార్కు వద్ద వారం రోజులపాటు సద్భావన దీక్షలు జరుగుతాయని చెప్పారు.

ఒక్కొక్క రోజు ఒక్కో సంఘం నేతలు ఇందులో పాల్గొంటారన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని ప్రాంతాల ప్రజలు శాంతియుతంగా సహకరించాలని, తమ ఉద్యమ కార్యాచరణ ఆ దిశగానే ఉంటుందని వెల్లడించారు. ఇదే క్రమంలో శుక్రవారం తాను ఢిల్లీ వెళ్లినట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తమవైపు తప్పులు ఉంటే సమీక్షించుకుంటామన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్ష గురించి ప్రస్తావించగా సమైక్యాంధ్ర ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వద్దని ఆమె ఎలా చెబుతారని, ఆమెకు ఆ హక్కు లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరే హక్కు ఉంటుంది తప్ప.. వేరే ప్రాంతాన్ని కలపాలని డిమాండ్‌చేసే హక్కు ఎవరికీ ఉండదన్నారు. ఆంటోనీ కమిటీ వద్దకు తాము వెళ్లబోమన్నారు. అధికారికంగా ఆహ్వానిస్తే ఐకాసలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

హైదరాబాద్‌లో సభ నిర్వహించుకునేందుకు సీమాంధ్ర ఉద్యోగులకు ఎలా అనుమతిస్తారో చూస్తామన్నారు. తెలంగాణపట్ల ఒక వర్గం మీడియా కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కోదండరాం ఆరోపించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో 11 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనడం లేదని, అయినా ఆ విషయాన్ని మీడియా ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అటువంటి సందర్భాలు చోటుచేసుకుంటే మాత్రం ప్రముఖంగా చూపిస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాదును శాశ్వత ఉమ్మడి రాజధానిగా అంగీకరించమన్నారు.

English summary
TJAC chairman Kodandaram said on Saturday TJAC will 
 
 not accept Hyderabad as permanent joint capital for 
 
 two states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X