వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ 20 ఉగ్రవాది తుండా అరెస్ట్, 43కేసుల్లో నిందితుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద పేలుళ్ల కోసం రెండు దశాబ్దాలుగా బాంబులు తయారు చేస్తున్న కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. భారత్ వెతుకుతున్న కరుడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో తుండా అలియాస్ అబ్దుల్ ఖుద్దూస్ ఒకడు.

నిఘా వర్గాల సమాచారంతో నేపాల్ సరిహద్దుల్లో అతణ్ని పోలీసులు పట్టుకున్నారు. బాంబుల తయారీలో సిద్ధహస్తుడైన 70 ఏళ్ల తుండా భారత్‌లో 40కి పైగా బాంబు పేలుళ్లలో కీలక పాత్ర పోషించాడు. 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్‌కు భారత్ అందించిన మోస్ట్ వాంటెడ్ టాప్ 20 ఉగ్రవాదుల జాబితాలో తుండా కూడా ఉన్నాడు.

New Delhi

బాంబులు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన అబ్దుల్ కరీం చేతిలో బాంబు పేలి ఎడమ చేయి పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి తుండాగా ప్రసిద్ధుడయ్యాడు. తుండా అంటే మొండి అని అర్థం. ఎక్కడికక్కడ స్థానికంగా లభించే రసాయన పదార్థాలను ఉపయోగించి బాంబులు తయారీలో యువతకు శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. కాగా, తుండాను ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

తుండాకు హైదరాబాదులోని టెర్రర్ నెట్ వర్క్‌తో సంబంధాలు ఉన్నాయి. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్లు మొదలు భారత దేశంలో జరిగిన 43 ఉగ్రవాద బాంబు దాడుల్లో తుండా పాత్ర ఉంది. అందులో 21 ఢిల్లీలోనివే. 1993లోనే ఎక్స్‌‍ప్రెస్ రైళ్లో బాంబు పెట్టాడు.

English summary
A Delhi court on Saturday sent arrested Lashkar-e-Taiba terrorist Abdul Karim Tunda to three-day police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X