వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ సైన్యం భద్రతలో దావూద్, కరాచీలో కలిశా: తుండా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Syed Karim Tunda reveals that he introduced Dawood to Hafiz
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ కరాచీలోనే పాక్ గూఢచార ఏజన్సీ ఐఎస్‌ఐ రక్షణలో ఉన్నాడని, తాను అతనిని కలిశానని రెండు రోజుల క్రితం పట్టుబడిన లష్కరే తోయిబాకు చెందిన బాంబుల తయారీ నిపుణుడు అబ్దుల్ కరీం తుండా చెప్పినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. మన దేశం అప్పగించమని పాక్‌ను కోరిన 20 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడయిన తుండాను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం గత శుక్రవారం భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేయడం తెలిసిందే.

తాను ఏడాది క్రితం దావూద్‌ను కరాచీలో కలిసినట్లు ఇంటరాగేషన్ సమయంలో తుండా చెప్పినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.
దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఉన్నట్లు గతవారం పాక్ ఉన్నతాధికారి ఒకరు తొలిసారిగా అంగీకరించడం, ఆ తర్వాత కొద్ది గంటలకే మాట మార్చడం తెలిసిందే.

పాకిస్తాన్ అధికారులకు అందించిన నివేదికల్లో భారత భద్రతా అధికారులు పదే పదే దావూద్ ఇబ్రహీం పేరును, అతని వివరాలను అందించినప్పటికీ అతను తమ దేశంలో ఉన్నాడనే విషయాన్ని పాక్ ఇప్పటివరకు తోసిపుచ్చుతూ వచ్చింది. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన 1993 నాటి ముంబయి వరస బాంబు పేలుళ్ల తర్వాత కరాచీకి పారిపోయిన దావూద్ అక్కడే ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి.

దావూద్, ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారయిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్‌లతో తుండా రెగ్యులర్ టచ్‌లో ఉన్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఆగస్టు 15కు వారం రోజుల ముందు కూడా అతను హఫీజ్‌ను కలిశాడని అంటున్నారు. అంతేకాదు తుండాకు ఐఎస్‌ఐతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, దానికి ఏజంట్లను రిక్రూట్ చేసే వాడిగా కూడా పని చేశాడని ఢిల్లీ పోలీసు వర్గాలు అంటున్నాయి.

అతను పాక్‌లో ఒక మదరసాల నెట్‌వర్క్‌ను కూడా నడుపుతున్నాడని తెలుస్తోంది. అను జుందాల్‌కన్నా కూడా తుండా పట్టుబడ్డం వల్ల ఎంతో ఉపయోగముందని, ఎందుకంటే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో టెర్రరిస్టు నెట్‌వర్క్ గురించి అతనికి బాగా తెలుసునని, బంగ్లాదేశ్‌లోని తన నెట్‌వర్క్‌లోని కార్యకర్తల ద్వారా ఉగ్రవాదులకు అవసరమైన మెటీరియల్‌ను, వ్యక్తులను భారత్‌లోకి ప్రవేశపెట్టేవాడని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.

English summary

 Abdul Karim Tunda alias Abdul Quddooss, who was arrested on Saturday, has confirmed that he was in touch with the Pakistani terror links and also said that he was the one who introduced Dawood Ibrahim to the Lashkar founder Hafiz Saeed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X