వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం నాయకత్వ మార్పుకైనా సై: యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కోసం తమ పార్టీ అధిష్టానం రాష్ట్రపతి పాలనకైనా, నాయకత్వ మార్పుకైనా వెనుకాడదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ బుధవారం హైదరాబాదులో అన్నారు. కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వెనక్కిపోదన్నారు. అవసరమైతే రాష్ట్రపతి పాలన, నాయకత్వ మార్పులకు కూడా సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాదులో జరగబోయే ఎపిఎన్జీవో సభలను తాము అడ్డుకుంటామన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల వెనుక ఎవరు ఉన్నారో ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద సమాచారముందన్నారు.

Madhyyashki and Ponnam Prabhakar

ఉద్యమ నాయకులతో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుసునన్నారు. తెలంగాణ ప్రక్రియ ఆగేది కాదని చెప్పారు. సిడబ్ల్యూసి తీర్మానాన్ని ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా శిరసా వహించాల్సిందేనని చెప్పారు. ఎపిఎన్జీవోలను తాము ఆంటోని కమిటీ భేటీకి తీసుకు వెళ్తామని చెప్పారు. వారి ఆందోళనకు పరిష్కారం చూపిస్తామన్నారు.

సీమాంధ్రలో ఉద్యమం సమైక్యవాదం కాదని, అవకాశవాదమని పొన్నం విమర్శించారు. సమైక్యవాదులు పార్టీ వీడినా కాంగ్రెసు నిర్ణయం మారదన్నారు. సమైక్యవాదం నిజమే అయితే స్వర్గీయ ప్రధానమంత్రి విగ్రహాన్ని సీమాంధ్రలో ఎందుకు ప్రతిష్టించలేదని ప్రశ్నించారు.

తన తండ్రి విగ్రహానికి సెక్యూరిటి పెంచుకున్న నాయకుడు దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలకు ఎందుకు సెక్యూరిటీని ఇవ్వలేదో చెప్పాలన్నారు. సీమాంధ్ర ఉద్యమ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని ఎద్దేవా చేశారు.

English summary
Congress MPs Madhyyashki and Ponnam Prabhakar on Wednesday said party High Command will not change stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X