వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన విషయం కొందరికి ముందే తెలుసు: ఆమంచి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Amanchi Krishna Mohan
హైదరాబాద్/గుంటూరు: రాష్ట్ర విభజనకు సంబంధించిన సమాచారం సీమాంధ్రకు చెందిన కొందరు మంత్రులు, పార్లమెంటు సభ్యులకు ముందే ఉందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మంగళవారం అన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంగళవారం ఆయన 48గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు.

వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని ఆమంచి స్వగృహం నుంచి మోటారు సైకిళ్ల ర్యాలీతో దీక్షా సెంటర్‌కు చేరుకున్నారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామా చేసినట్లయితే రాష్ట్ర విభజన జరగదని ఆమంచి అన్నారు.

జెపి ఆక్షేపణ

ఇంజనీరింగ్ ప్రవేశాలకు జరుగుతున్న కౌన్సెలింగ్‌కు సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు సహకరించాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదులో కోరారు. ఏ ప్రాంతమైనా రాజకీయ ఉద్యమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం సరికాదని ఆయన హితవు పలికారు.

ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సమస్యలకు సామరస్య పరిష్కారం చూపేందుకు లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లోనూ బహిరంగ సభలను నిర్వహించనుందని జేపీ ప్రకటించారు.

English summary
Chirala MLA Amanchi Krishna Mohan begins his 48 hours fast on Tuesday at Chirala to support United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X