వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరి ఎఫెక్ట్: ఎన్టీఆర్ సినిమాలపై ఓయు జెఎసి హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

OU Jac and NTR
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజీనామా చేసిన నేపథ్యంలో తాము ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకుంటామని ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి గురువారం హెచ్చరించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ రోజు హరికృష్ణ రాజీనామా చేయగా రాజ్యసభ చైర్మన్ రాజీనామాను ఆమోదించిన విషయం తెలిసిందే.

హరికృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందున తాము జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణ ప్రాంతంలో అడ్డుకుంటామని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణవాదా లేక సమైక్యవాదా చెప్పాలని ఈ సందర్భంగా ఓయు జెఏసి డిమాండ్ చేసింది. జూనియర్ తన అభిప్రాయం చెప్పకుంటే రామయ్యా వస్తావయ్య సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.

పోటాపోటీ సభలు

ఎపిఎన్జీవోలు, ఉస్మానియా ఐకాసలు వచ్చే నెల 7వ తేదిన పోటా పోటీ సభలకు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెల 7న ఎల్బీ స్టేడియంలో సమైక్య సభకు అనుమతివ్వాలని ఎపిఎన్జీవోలు పోలీసు అధికారులను కోరగా, అదే రోజు తమకు నిజాం కళాశాల ప్రాంగణంలో మరో మిలియన్ మార్చ్‌కు అనుమతివ్వాలని ఓయు జెఏసి కోరింది.

సిడబ్ల్యూసి నిర్ణయం స్వాగతించిన మావోయిస్టు కిరణ్

విభజనపై సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని మావోయిస్టులు స్వాగతించారు. మావోయిస్టు కిరణ్ పేర ఓ లేఖ విడుదలైంది. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా వద్దని, పోలవరం ప్రాజెక్టును కట్టకూడదని సూచించారు. తెలంగాణలో భూసంస్కరణల కోసం పోరాడాలని కోరారు. పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణనే కావాలన్నారు.

English summary
Osmania JAC warned that they will obstruct Hero Junior NTR films in Telangana regions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X