హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు యాత్రలో రాళ్లో, పూలో చూద్దాం: కొండ్రు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kondru Murali
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రలో ఆయనకు రాళ్లు పడతాయో, పూలు పడతాయో చూద్దామని మంత్రి కొండ్రు మురళి మోహన్ గురువారం అన్నారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐలే కారణమన్నారు. విభజన విషయంలో కాంగ్రెసును దోషిగా నిలబడితే తాము సహించేది లేదని ఆయన చెప్పారు.

తాము కూడా ప్రజల్లోకి వెళ్లి జరిగింది చెబుతామన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ వెనుకపడుతుందనేదే తమ ఆందోళన అన్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో తాము పోటీ చేసే పరిస్థితి ఉండదని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆంటోని కమిటీకి వివరించారన్నారు. తమ పార్టీ అధిష్టానం అన్నింటిని పరిశీలిస్తోందని చెప్పారు. హైదరాబాదు అభివృద్ధిలో అందరి పాత్ర ఉందని అందుకే, అందరు దాని గురించి మాట్లాడుతున్నారన్నారు.

కేంద్రమంత్రులు అమ్ముడుపోయారు: ఆమంచి

కేంద్రమంత్రులు పదవులకు అమ్ముడు పోయారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ గురువారం ప్రకాశం జిల్లాలో మండిపడ్డారు. ఆయన 48 గంటల దీక్ష నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రులు అమ్ముడుపోయినందు వల్లే రాజీనామా చేయడం లేదని ఆరోపించారు. అందరు రాజీనామా చేస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్నారు.

క్షీణించిన పల్లె రఘునాథ్ ఆరోగ్యం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోగ్యం విషమించింది. దీక్ష విరమించాలని వైద్యులు ఆయనకు సూచించారు. వారి సూచనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. విశాఖ జిల్లా పాడేరులోని మంత్రి పసుపులేటి బాలరాజు ఇంటిని ఉపాధ్యాయ ఐక్యకార్యాచరణ సమితి ముట్టడించింది.

English summary
Minister Kondru Murali on Thursday blamed that Telugudesam, BJP and CPI for AP division decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X