వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరి రిజైన్: సభలో పాల్వాయి హల్‌చల్, రేణుక ఆక్షేపణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna resign: CM and Sujana object Palvai
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ రాజీనామాను గురువారం రాజ్యసభలో ఆమోదించిన సమయంలో కాంగ్రెసు పార్టీ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాసేపు హంగామా చేశారు. హరి రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటన చేసిన సమయంలో టిడిపి ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్'' అంటూ నినాదాలు చేశారు.

దాంతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారివద్దకు దూసుకువెళ్లారు. హరికృష్ణ రాజీనామా చేసినట్లుగా మీరు కూడా రాజీనామా చేయండని సవాల్ చేశారు. దీంతో సుజనా, సిఎం రమేష్‌లు ఆయన వైపు రాగా, మంత్రి వయలార్ రవి ఆయనను వెనక్కు తీసుకువెళ్లారు.

అదే సమయంలో సభలోకి కాంగ్రెసు ఎంపి రేణుకా చౌదరి ప్రవేశించారు. టిడిపి సభ్యులకు పాల్వాయి సవాల్ పైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి వారిని రెచ్చగొట్టడుతున్నారని ఆక్షేపించారు. "వారంతా రాజీనామా చేసి హీరోలయిపోవాలనా మీ ఉద్దేశం? మీరెందుకు వారిని రెచ్చగొడుతున్నారు?'' అని పాల్వాయిని ప్రశ్నించారు.

కాగా, హరిలా తమను రాజీనామా చేయాలని పాల్వాయి చేసిన సవాల్ పైన సుజనా, సిఎంలు స్పందించారు. పాల్వాయి వ్యాఖ్యలను వారు ఆక్షేపించారు. తాము తమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని చెప్పారు.

English summary
Telugudesam Party MPs CM Ramesh, Sujana Choudhary object to Palvai Goverdhan Reddy asking them to quit like Harikrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X