వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలులో దీక్ష: వైయస్ జగన్‌కు మద్దతుగా మోపిదేవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ys Jagn and Mopidevi Venkataramana
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు వైయస్ జగన్ చేసే దీక్షకు మద్దతుగా తాను దీక్ష చేపట్టాలని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. రేపు ఆదివారం నుంచి వైయస్ జగన్ జైలులో దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

తాము దీక్ష చేపట్టే విషయంపై జగన్, మోపిదేవి తమ న్యాయవాదుల ద్వారా న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీక్షలకు అనుమతి కోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వారి దీక్షలకు అధికారుల నుంచి అనుమతి లభించే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, దీక్షకు అనుమతి కోరుతూ తమకు ఏ విధమైన లేఖ అందలేదని జైలు అధికారులు చెబుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణతో పాటు భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌ను కలిశారు. జగన్ రేపటి నుంచి జైలులో దీక్ష చేపడుతారని కొణతాల రామకృష్ణ చెప్పారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ దీక్ష చేస్తారని ఆయన శనివారం మీడియాతో చెప్పారు.

రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, ఆలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమస్యను మరింత జఠిలం చేసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా జగన్ రేపటి నుంచి దీక్ష చేస్తారని ఆయన చెప్పారు.

English summary
According to sources - former minister mopidevi Venkata Ramana to take up fast along with YSR Congress party president YS Jagan in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X