కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోదరుడి హత్య: లొంగిపోయిన టిడిపి ఎమ్మెల్యే శేఖర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Erra Sekhar
మహబూబ్ నగర్/హైదరాబాద్: సోదరుడి హత్య కేసులో పాలమూరు జిల్లా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు ఎర్ర శేఖర్ సోమవారం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. గత నెల 17వ తేదిన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు జగన్మోహన్ హత్యకు గురైన విషయం తెలిసిందే.

దేవరకద్రలో జగన్మోహన్ కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపారు. ఎర్ర శేఖర్, జగన్మోహన్‌లు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామంలో తమ భార్యలను సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలిపారు. ఎన్నికలలో ఎమ్మెల్యే శేఖర్ భార్య విజయం సాధించారు.

కాగా, జగన్మోహన్ హత్య కేసులో ఎర్ర శేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన ఈ రోజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. హత్య అనంతరం శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతికాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం శేఖర్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతను ఈ రోజు లొంగిపోయారు.

చెన్నమనేని రివ్యూ పిటిషన్ కొట్టివేత

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు సోమవారం మరోసారి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.

English summary
The Telugudesam Party Jedcharla MLA Erra Sekhar on Monday surrendered before Mahaboobnagar SP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X