హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరుగు అదుర్స్: యువత, విదేశీయుల జోరు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ మారథాన్ 2013 ఆదివారం వేడుకగా జరిగింది. హైదరాబాద్ కీర్తిని దశదిశలా వ్యాప్తింపజేస్తూ, నగరవాసుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటానికి కొన్నేళ్లుగా దీనిని నిర్వహిస్తున్నారు. ఐదు విభాగాల్లో జరిగిన ఈ మారథాన్ పోటీల్లో ఫుల్ మారథాన్‌ను నెక్లెస్ రోడ్ వద్ద భారతీ ఎయిర్‌టెల్ సంస్థ హబ్ ఆంధ్రప్రదేశ్ సిఈవో రమేష్ మీనన్ ప్రారంభించారు.

హాఫ్ మారథాన్‌ను జిహెచ్ఎంసి కమిషనర్ కృష్ణబాబు, పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద సిఈవో రన్‌ను రమేష్ మీనన్, 5 కె రన్‌ను ప్రజ్ఞాన్ ఓజా ప్రారంభించారు. ఆరువేల మందికి పైగా రన్నర్లు పాల్గొన్న ఈ మారథాన్‌లో 30 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు, రన్నర్స్ గ్రూప్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ పరుగులో ప్రధాన ఆకర్షణగా బ్లేడ్, శారీరక వికలాంగ రన్నర్స్ నిలిచారు. కృత్రిమ కాలు అమర్చుకున్న 25 మంది పాల్గొన్నారు. హైదరాబాద్ మారథాన్ చరిత్రలో తొలిసారిగా ఓ అంధుడు కూడా పోటీలో పాల్గొని హాఫ్ మారథాన్ పూర్తి చేశాడు. మహిళల మారథాన్ విభాగంలో జ్యోతి సింగ్, పురుషుల విభాగంలో రామ్ సింగ్ యాదవ్ విజేతలుగా నిలిచి 45వేల రూపాయల చొప్పున నగదు బహుమతి గెలుచుకున్నారు.

 మారథాన్ 1

మారథాన్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం 'హైదరాబాద్ మారథాన్ 2013' జరిగింది. ఈ మారథాన్‌కు మంచి స్పందన లభించింది.

మారథాన్ 2

మారథాన్ 2

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం 'హైదరాబాద్ మారథాన్ 2013' జరిగింది. మారథాన్‌లో పాల్గొన్న నగర మహిళలు.

మారథాన్ 3

మారథాన్ 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం 'హైదరాబాద్ మారథాన్ 2013' జరిగింది. మారథాన్‌లో పాల్గొన్న నగర యువత.

మారథాన్ 4

మారథాన్ 4

నగరంలో జరిగిన 'హైదరాబాద్ మారథాన్ 2013'లో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉత్సాహంగా పరుగెడుతున్న ఓ యువతి.

మారథాన్ 5

మారథాన్ 5

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం ఉదయం 'హైదరాబాద్ మారథాన్ 2013' జరిగింది. మారథాన్‌లో పాల్గొన్న నగర యువతి.

మారథాన్ 6

మారథాన్ 6

'హైదరాబాద్ మారథాన్ 2013' ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్‌లు, 5కె రన్‌లు జరిగాయి. గచ్చిబౌలి స్టేడియం వద్ద 5కె రన్ జరిగింది.

మారథాన్ 7

మారథాన్ 7

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం ఉదయం 'హైదరాబాద్ మారథాన్ 2013' జరిగింది. మారథాన్‌లో పాల్గొన్న నగర, విదేశీ మహిళలు.

మారథాన్ 8

మారథాన్ 8

నగరంలో జరిగిన 'హైదరాబాద్ మారథాన్ 2013'లో పాల్గొన్న ఓ యువతి. ఈ హైదరాబాద్ మారథాన్‍‌ను గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.

మారథాన్ 9

మారథాన్ 9

నగరంలో 'హైదరాబాద్ మారథాన్ 2013'లో ఆదివారం ఉదయం పాల్గొన్న నగర ప్రజలు. ఇందులో విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మారథాన్ 10

మారథాన్ 10

నగరంలో 'హైదరాబాద్ మారథాన్ 2013'లో ఆదివారం ఉదయం పాల్గొన్న నగర ప్రజలు. ఇందులో విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మారథాన్ 11

మారథాన్ 11

'హైదరాబాద్ మారథాన్ 2013'లో నగర యువత ఉత్సాహంగా పాల్గొన్నది. ఈ పరుగులో ప్రధాన ఆకర్షణగా బ్లేడ్, శారీరక వికలాంగ రన్నర్స్ నిలిచారు.

మారథాన్ 12

మారథాన్ 12

'హైదరాబాద్ మారథాన్ 2013'లో భాగంగా నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పరుగులో పాల్గొన్న నగరానికి చెందిన వారు.

మారథాన్ 13

మారథాన్ 13

'హైదరాబాద్ మారథాన్ 2013' ఆదివారం ఉదయం వేడుకగా జరిగింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పరుగులో పాల్గొన్న నగర యువతీ, యువకులు.

English summary

 Ram Singh Yadav and Jyoti Singh emerged champions at the Hyderabad Marathon 2013 held in the Hyderabad on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X