వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భస్మాసుర హస్తం: మురళీమోహన్, కిషోర్ భేషని బైరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Murali Mohan
హైదరాబాద్/కర్నూలు/ఏలూరు: రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తం కానుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మురళీ మోహన్ ఆదివారం అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న రాజకీయ స్వార్థంతోనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నారని ఆరోపించారు.

విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయాలకు అతీతమైన ప్రజా ఉద్యమం ఉద్భవించిందని, దాంతో పునరాలోచనలో పడ్డ ఢిల్లీ పెద్దలు ఏం చేయాలనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారని, సమైక్య ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానానికి చేర్చిన టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కిషోర్ చంద్రదేవ్‌కు బైరెడ్డి ప్రశంస

రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ అభిప్రాయాలను స్వాగతిస్తున్నామని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వేరుగా పేర్కొన్నారు. విభజనతో సీమ ప్రాంతవాసులకు జరిగే నష్టాన్ని కిషోర్ వివరంగా తెలిపారన్నారు. ఉత్తర కోస్తా నాయకుడు సీమకు వాటిల్లే నష్టాన్ని చెబుతుంటే సీమనాయకులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని, ఈ నాయకులంతా పురుగు మందు తాగి చావాలని దుయ్యబట్టారు. టిడిపి ఎంపి శివ ప్రసాద్ తనకు తాను కొరడాతో కొట్టుకునే బదులు చంద్రబాబును కొట్టాలన్నారు.

మరో పాలస్తీనా: తులసి రెడ్డి

రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదులపై విభజనవాదులు చేస్తున్న దాడులను చూస్తుంటే హైదరాబాద్ మరో పాలస్తీనా కాబోతోందని అనిపిస్తోందని కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి విజయవాడలో అన్నారు. రాజధానిలో ఉంటున్న సీమాంధ్రులను అక్కడి పని వారు ఇళ్లు తమకిచ్చి వెళ్లిపోవాలని అంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంద్రులు ధన, మాన, ప్రాణ భయంతో, అభద్రత భావంతో ఉంటున్నారని చెప్పారు.

English summary

 Rayalaseema Parirakshana Samithi chief Byreddy Rajasekhar Reddy on Sunday suggested TDP MP Siva Prasad that instead of whipping himself, he should whip Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X