వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోగా భావించి.. విద్యార్థి నేతను కొట్టి చంపిన వైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jharkhand
రాంచీ/భువనేశ్వర్: ఆల్ జార్ఖండ్ విద్యార్థి యూనియన్(ఎజెఎస్‌యు) విద్యార్థి నాయకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను, ఆయన డ్రైవర్‌ను మావోయిస్టులుగా భావించి ఓ గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన జార్ఖండ్‌లో జరిగింది. దేవగఢ్ జిల్లాలోని రోహిణి గ్రామానికి చెందిన పలువురు వారిని కొట్టి చంపారని పోలీసులు చెప్పారు.

ముఖేష్ తన డ్రైవర్‌తో కలిసి ఉదయం దేవగఢ్‌కు కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో గ్రామస్తులు వారి కారును నిలిపివేశారు. వారిని ప్రశ్నించారు. అంతలోనే గ్రామంలో మావోయిస్టుల కోసం గస్తీ తిరుగుతున్న గ్రామస్థులు వీరి కారును చూసి మావోయిస్టులుగా పొరబడ్డారని, వారి దాడి నుండి తప్పించుకునేందుకు పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిని కొట్టి చంపారని పోలీసులు చెప్పారు.

గత కొంతకాలంగా గ్రామంలో భారీ దొంగతనాలు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. వీటి వెనుక మావోయిస్టులు ఉన్నారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. దీంతో వారు గస్తీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖేష్‌ను, ఆయన డ్రైవర్‌ను గ్రామస్తులు ఆపివేశారు.

తాను మావోయిస్టును కాదని ముఖేష్ వారితో వాగ్వాదానికి దిగాడు. తాను ఎజెఎస్‌యు విద్యార్థి నేతనను అని తన కారుకు ఉన్న గుర్తును చూపించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ గ్రామస్తులు ఆయన వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో వారు పట్టుకొని చితకబాదారు. వారు చనిపోయారు.

మావోల మందుపాతర - బిఎస్ఎఫ్ జవాన్లు మృతి

ఒడిశాలో మావోయిస్టులు మళ్లీ చెలరేగిపోయారు. కోరావుట్ జిల్లా కొట్టంగిలో మావోలు పెట్టిన మందు పాతర పేలి నలుగురు బిఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.

English summary
All Jharkhand Students Union (AJSU) leader Mukesh Kumar Singh along with his driver were beaten to death by a group of villagers in Deoghar district's Rohini village after an altercation broke out between them, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X