వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: భత్కల్ అరెస్టుతో హైదరాబాద్ సంబరాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ జంట బాంబు పేలుళ్ల గాయం ఇంకా సలుపుతూనే ఉన్నది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఈ పేలుళ్లకు సూత్రధారి అనే ఆరోపణ ఉంది. ఈ స్థితిలో అతని అరెస్టుతో హైదరాబాద్ ప్రజలు గురువారం సంబరాలు చేసుకున్నారు.

2013 ఫిబ్రవరి 21వ తేదీన దాదాపు సాయంత్రం 7 గంటల సమయంలో హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా 17 మంది మరణించారు. ఈ సంఘటన హైదరాబాద్ ప్రజలను ఇంకా కలచివేస్తూనే ఉన్నది.

దేశంలోని పలు బాంబు పేలుళ్ల కేసులో బాధ్యుడిగా భావిస్తున్న యాసిన్ భత్కల్‌ను ఎన్ఐఎ, బీహార్ పోలీసు బలగాలు అత్యంత రహస్యంగా పథకం ప్రకారం అరెస్టు చేశాయి. భత్కల్‌ను పోలీసులు గురువారం మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. రేపు శుక్రవారం అతన్ని ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.

కొవ్వొత్తులతో వేడుకలు

కొవ్వొత్తులతో వేడుకలు

హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ జంట పేలుళ్లకు బాధ్యుడిగా భావిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును కొవ్వొత్తులు వెలిగించి ప్రజలు వేడుక చేసుకున్నారు.

ఇలా గుమిగూడి వేడుక..

ఇలా గుమిగూడి వేడుక..

హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ జంట పేలుళ్లకు బాధ్యుడిగా భావిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును ప్రజలు జట్టుగా వేడుక చేసుకున్నారు. వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భత్కల్‌ను ఉరి తీయండి

భత్కల్‌ను ఉరి తీయండి

హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ జంట పేలుళ్లకు బాధ్యుడిగా భావిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును నగర ప్రజలు హర్షిస్తున్నారు. భత్కల్‌ను ఉరితీయాలనే నినాదం రాసిన ప్లకార్డులను ప్రదర్సించారు.

స్వీట్లు తినిపించుకున్నారు..

స్వీట్లు తినిపించుకున్నారు..

హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ జంట పేలుళ్లకు బాధ్యుడిగా భావిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును ప్రజలు పరస్పరం తీపి పదార్థాలను తినిపించుకుని సంబరంగా ఆనందించారు.

English summary

 Hyderabad celebrated the arrest of Indian Mujahideen founder Yasin Bhatkal, accused in Dilsukhnagar bomb blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X