వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీపై వీరశివా ఫైర్: కొత్త పార్టీ, కిరణ్ నిర్ణయంపై వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasiva Reddy
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా వచ్చాక రాష్ట్రం భ్రష్టు పట్టిందని, అధిష్టానం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే సీమాంధ్రలో కొత్త పార్టీ పుట్టుకు వస్తుందని కమలాపురం కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి శుక్రవారం అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.

కెసిఆర్‌కు బెదిరింపు ఫోన్లు చేసిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్, సందేశాలు పంపించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కర్నాటక రాజధాని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అతని వయస్సు 17. అతను అమ్మాయిలను కూడా ఫోన్లో కూడా వేధించినట్లు పోలీసులు చెప్పారు.

పార్లమెంటులో కరపత్రాలు

'రాష్ట్ర విభజన స్వార్థపూరిత నిర్ణయం' అంటూ తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో శుక్రవారం కరపత్రాలు పంచారు. విభజన నిర్ణయం ఆపి రాష్ట్రానికి న్యాయం చేయాలని వారు కోరారు. సభలో టిడిపి, కాంగ్రెసు సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఎపి అంటూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు.

పురంధేశ్వరిని కలిసిన సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు

కేంద్రమంత్రులు పురంధేశ్వరి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలను సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు.

English summary
Kamalapuram MLA Veerasiva Reddy on Friday fired at Congress Party AP incharge Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X