వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ హెల్త్ రిపోర్ట్: ఆందోళకరం, సాయంత్రం ఫ్లూయిడ్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ys Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఉస్మానియా వైద్యశాల ఆర్ఎంవో రఫీ శుక్రవారం చెప్పారు. జగన్ శరీరంలో షుగర్ నిల్వలు గణనీయంగా తగ్గాయని, పల్స్ రేట్ తగ్గిందని చెప్పారు.

సాయంత్రం ఆరు గంటల వరకు పరిస్థితి ఇలాగే ఉంటే ఆ తర్వాత జగన్‌కు బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని చెప్పారు. ఫ్లూయిడ్స్ ఇవ్వకపోతే జగన్ ఆరోగ్యం విషమించే అవకాశముందన్నారు. ఆరోగ్యం దృష్ట్యా బలవంతంగా ఫ్లూయిడ్స్ ఇవ్వక తప్పదని చెప్పారు.

జగన్‌కు షుగర్ 60, పల్స్ రేట్ 56-60 మధ్య, కీటోన్స్ 4 ప్లస్ ఉన్నాయి. బిపి 110/70 ఉంది. కాగా, తాను వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు జగన్ వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఆహారం తీసుకోవాల్సిందిగా వైద్యులు జగన్‌కు సూచించారు. జగన్ మాత్రం ససేమీరా అంటున్నారు.

ఎపిఎన్జీవోల సభ సబబే: రాయపాటి

హైదరాబాదులో ఎపిఎన్జీవోలు సభ నిర్వహించడం సబబేనని ఎంపి రాయపాటి సాంబశివ రావు గుంటూరులో అన్నారు. రాష్ట్ర విభనజపై కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే సీమాంధ్రలో కొత్త పార్టీలు వచ్చే అవకాశముందన్నారు.

కీరణ్ వ్యాఖ్యల్లో తప్పులేదు: శైలజానాథ్

విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి శైలజానాథ్ హైదరాబాదులో అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని, వాటిని వెనక్కి తీసుకున్న అనంతరం వారు యాత్రలు చేపట్టాలన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము వచ్చే నెల 3న అసెంబ్లీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తామన్నారు.

English summary
Osmania Hospital RMO Raffi on Friday said they will give fluids to YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X