• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

8 చోట్ల రెక్కీ: రాత్రి నిద్రలేని భత్కల్, 12 రాష్ట్రాల విజ్ఞప్తి

By Srinivas
|

Yasin Bhatkal
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెండ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ హైదరాబాదులో ఎనిమిదిచోట్ల రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ వాంగ్మూలంతో యాసిన్ భత్కల్‌ను ఎన్ఐఏ అధికారులు నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. బీహార్ పోలీసులు అరెస్టు చేసిన యాసిన్ భత్కల్, మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.

వారిని ఢిల్లీ పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టారు. బీహార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. బీహార్ పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి వారిని పట్టుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతోందన్నారు.

అంతకుముందు వారికి బీహార్‌లోని మోతీహారి జిల్లా న్యాయస్థానం మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండును విధించింది. కాగా, హైదరాబాదులో పేలుళ్లు జరిపేందుకు భత్కల్, అక్తర్‌లు కలిసి ఎనిమిది చోట్ల రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో పాటు బీహార్ బుద్ధగయ పేలుళ్లలోను వీరి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, బుద్దగయ పేలుళ్లలో వీరి పాత్రను అధికారులు ఖండిస్తున్నారు.

హైదరాబాదులో పలు రెక్కీ నిర్వహించిన వీరిని నగరానికి తీసుకు వచ్చేందుకు ఎపి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గురువారం రాత్రి యాసిన్ భత్కల్ పాట్నా జైలులో నిద్రలేమితో గడిపినట్లుగా బీహార్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

శుక్రవారం ఉదయం ఎన్ఐఏ అదికారులు భత్కల్‌ను ప్రశ్నించారు. తదపరి విచారణకు భత్కల్‌ను ఢిల్లీకి తరలించారు. భత్కల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి పన్నెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Indian Mujahideen Co founder Yasin Bhatkal and his associate was flown to Delhi by a special plane on Friday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X