వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలు పౌరుషం చూపిస్తాం: కెఇ, రాయపాటి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

KE Krishnamurthy
కర్నూలు/ గుంటూరు : హైదరాబాదులో సీమాంధ్ర ఉద్యోగుల జోలికొస్తే కర్నూలు పౌరుషం రుచి చూపించాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కృష్ణమూర్తి హెచ్చరించారు. శుక్రవారం కర్నూలులో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో నివసించే హక్కు అందరికీ ఉందన్నారు. ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే తెలంగాణ నాయకులకు అభ్యంతరమెందుకని ప్రశ్నించారు.

ఏపీఎన్జీవోల సభను అడ్డుకుంటే కర్నూలు నుంచే ఉద్యమం ప్రారంభమవుతుందని, అడ్డుకున్న వారికి కర్నూలు పౌరుషం రుచి చూపించాల్సి వస్తుందని కెఇ హెచ్చరించారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కమ్మక్కై రాష్ట్ర విభజనపై నాటకాలు ఆడుతున్నాయని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజలు వారి కుతంత్రాలు తిప్పికొట్టాలని కోరారు.

రాష్ట్ర సమైక్యతపై స్పష్టమైన ప్రకటన రాకుంటే సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కావడం తథ్యమని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. సీమాంద్రుల మనోభావాలకు అనుగుణంగా ఆ పార్టీని ప్రజలే నిర్మించి వారే నడిపిస్తారని చెప్పారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మూడు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదనను బలంగా వినిపి స్తున్నారన్నారు. వచ్చే నెల 6వ తేదీ తర్వాత సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

English summary
Telugudesam party leader KE Krishna Murthy has warned Telanganites dire consequences, if Seemandhra staff is attacked in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X