వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పినా జగన్ వినడు, తలిచిందే చేస్తాడు: భారతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినరని, తాను అనుకున్నదే జగన్ చేస్తాడని ఆయన సతీమణి వైయస్ భారతి అన్నారు. జగన్‌తో ఉండడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె శనివారంనాడు నిమ్స్‌కు వచ్చారు. జగన్‌ నిమ్స్‌లో కూడా చికిత్స నిరాకరించడంపై ఆమె నిమ్స్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు

జగన్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారని, పరిస్థితి ఏమిటనేది లోపలికి వెళ్తే గానీ తనకు తెలియదని ఆమె అన్నారు. బలవంతంగా జగన్‌కు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి అనుమతి కోరుతున్నట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు. దీక్ష విరమించాలని జగన్‌ను తల్లి విజయమ్మ కోరారని, పార్టీ నాయకులు కూడా కోరారని, అయినా జగన్ వినడం లేదని ఆమె అన్నారు.

YS Jagan and YS Bharathi

జగన్ శరీరంలో కీటోన్స్ పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారని, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినట్లు తెలిపారని ఆమె అన్నారు. వైద్యులు ఒత్తిడి చేస్తున్నా ఫ్లూయిడ్స్ గానీ గ్లూకోజు గానీ తీసుకోవడానికి జగన్ నిరాకరిస్తున్నాడు. ఆయన నిమ్స్‌లో తన దీక్షను కొనసాగిస్తున్నారు.

దీక్ష విరమించాలని కోరుతూ ప్రముఖ జర్నలిస్టు ఎబికె ప్రసాద్ వైయస్ జగన్‌కు లేఖ రాశారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ జగన్ చంచల్‌గుడా జైలులో గత ఆదివారం దీక్షను ప్రాంరంభించిన విషయం తెలిసిందే. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను గురువారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి నిమ్స్‌కు తరలించారు.

English summary
YSR Congress party president YS jagan's wife YS Bharathi said that her husband will not hear anybody and he is rejecting to withdraw fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X