వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'... చంద్రబాంబు': నిలదీయాలని జగన్ పార్టీ, కాంగ్‌పై నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: ఆత్మగౌరవం పేరుతో బస్సుయాత్ర కొస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రులు నిలదీయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. బాబు ప్రణబ్‌కు లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడయ్యారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తమ్మినేని సీతారాం శనివారం ఓ పోస్టర్ విడుదల చేశారు.

రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి 40 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపడమేనని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయగా ఆనాడు సిఎల్పీ లీడర్‌గా ఆ ఎమ్మెల్యేల లేఖను వైయస్ పంపించింది నిజమేనని అంగీకరించారు. అయితే తనకు తానుగా వైయస్ ఎక్కడా తెలంగాణకు అనుకూలమని చెప్పలేదన్నారు. టిడిపి పలుసార్లు తెలంగాణకు అనుకూలమంటూ కేంద్రానికి లేఖలు ఇచ్చి, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఆత్మగౌరవయాత్ర అని చంద్రబాబు చెప్పడం దొంగే దొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు.

ఆయన చేయాల్సింది ప్రజల కోసం ఆత్మగౌరవయాత్ర కాదని, కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని తన కోసం పశ్చాతాప యాత్ర చేయాలన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి చంద్రబాబు గొడ్డలి(తెలంగాణకు అనుకూలంగా లేఖ) ఇచ్చారని 'సమైక్యంపై చంద్రబాంబు' అంటూ పోస్టర్ విడుదల చేశారు. కాగా, విభజనలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్ర లేదా అని ప్రశ్నిస్తే వాటికి సమాధానం ఇవ్వలేదు.

సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టకోదని, ఎన్నికల అనంతరం ఎవరితో కలుస్తామో ఇప్పుడు చెప్పలేమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో కలిసిపోతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా? అని విలేఖర్లు ప్రశ్నించగా అప్పుడు ఎవరితో కలుస్తామనేది ఇప్పుడెందుకు, అప్పుడే చెబుతాం అని సమాధానమిచ్చారు. కాగా, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు బస్సుయాత్ర ఎలా చేపడతారని ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి వేరుగా ప్రశ్నించారు.

English summary
YSR Congress Party MLA Srikanth Reddy on Saturday 
 
 questioned how can TDP chief Nara Chandrababu Naidu 
 
 go on bus yatra, after having given a proTelangana 
 
 letter to the Centre?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X